సుకుమార్… తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన డైరెక్టర్.ఢిఫరెంట్ స్టోరీలతో పాటు అద్భుతమైన టేకింగ్ తో చక్కటి సినిమాలు తెరకెక్కించే సత్తా కలిగిన దర్శకుడు.
సినిమాల్లోకి రాక ముందు ఆయన మ్యాథ్స్ లెక్చరర్.పిల్లలకు పాఠాలు చెప్తున్నా.
తన మనసంతా సినిమాల పైనే ఉండేది.తను అధ్యాపకుడిగా ఉన్న సమయంలోనే ఓ మంచి కథ రాసుకున్నాడు.
ఎలాగైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్నాడు.సినిమాలో అవకాశం కూడా సుకుమార్ కు ఈజీగానే దొరికింది.
వివి వినాయక్ తమ్ముడు సుకుమార్ మంచి మిత్రులు.ఆ పరిచయంతో దిల్ సినిమాకు వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరాడు.
సినిమా షూటింగ్ సమయంలో వినాయక్ తో పాటు దిల్ రాజుకు బాగా నచ్చాడు.ఈ సినిమా హిట్ అయితే నీకు డైరెక్టర్ గా అవకాశం ఇస్తానని దిల్ రాజు ప్రామిస్ చేశాడు.2003లో విడుదల అయిన దిల్ మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది.హామీ ఇచ్చినట్టుగానే సుకుమార్ కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు దిల్ రాజు.
తను రాసుకున్న కథ దిల్ రాజుకు వినిపించాడు.బాగానే ఉంది.ఓకే అన్నాడు.హీరో ఎవరైతే బాగుంటుంది అని వెతికారు.ప్రభాస్ కు చెప్తే సారీ అన్నాడు.నితిన్ కూడా చేయనన్నాడు.
రవితేజ ఫుల్ బిజీ.ఒకరోజు దిల్ సినిమాను ప్రభాస్ కు స్పెషల్ గా చూపించాడు దిల్ రాజు.
ఆ సమయంలో ప్రభాస్ తో వచ్చి ఓ అబ్బాయి తెగ అల్లరి చేస్తున్నాడు.అతడిని చూడగానే తన కథకు ఇతడు సూట్ అవుతాడని భావించాడు.
అతడు ఎవరని ఆరాతీస్తే అల్లు అరవింద్ కొడుకు అని తెలిసింది.అప్పటికే గంగోత్రి సినిమా చేశాడని చెప్పారు.
దిల్ సినిమా చూడ్డం అయ్యాక.సుకుమార్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లాడు.తన దగ్గర ఓ మంచి స్టోరి ఉంది వినండి అని చెప్పాడు.కథ నచ్చితే మీరే హీరోగా చేయాలని చెప్పాడు.కథ చెప్పాడు.బన్నీకి బాగా నచ్చింది.
వెంటనే డాడీతో మాట్లాడాలని చెప్పాడు.కథ విన్న అల్లు అర్జున్ ఓకే చెప్పాడు.చిరంజీవి సైతం కథ విని 100 డేస్ ఫంక్షన్ కు రెడీకండి అని చెప్పాడట.4 కోట్ల రూపాయలతో ఈ సినిమా చేశారు.ఆర్య అని పేరు పెట్టారు.మూడు నెలల పాటు షూటింగ్ కొనసాగింది.2004 మే 2 న ఈ విడుదల చేశారు.మంచి స్టోరీ.
సూపర్ గా నటించిన హీరో.సుకుమార్ అద్భుత టేకింగ్.
ఉర్రూతలూపే సాంగ్స్ సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి.ఫీల్ మై లవ్ , అ అంటే అమలాపురం పాటలు తెలుగు రాష్ట్రాల్లో జనాలకు పిచ్చి పిచ్చిగా నచ్చాయి.
4 కోట్లతో రూపొందిన ఈ సినిమా 16 కోట్ల రూపాయలను వసూలు చేసింది.90 థియేటర్లలో 50 రోజులు ఆడింది.56 సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంది.అంతేకాదు.
ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నాడు. బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు పొందాడు.
స్క్రీన్ ప్లే రైటర్ కి, ఫైట్ మాస్టర్స్ కి నంది అవార్డులు వచ్చాయి.ఈ సినిమాతో సుకుమార్ కు దర్శకుడిగా ఓ లెవల్ వచ్చింది.
తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు.