నేను సినిమాలు తీసినంత కాలం సమంతను తీసుకుంటూనే ఉంటా.. సుకుమార్ ఏమన్నారంటే?

స్టార్ డైరెక్టర్ సుకుమార్( Director Sukumar ) టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సూకుమార్ సినిమా హిట్టైనా ఫ్లాపైనా ఆ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుందని చాలామంది భావిస్తారు.

 Director Sukumar Comments About Samantha Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఒక సందర్భంలో సుకుమార్ సమంత( Samantha ) గురించి చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.సమంతపై ఉన్న అభిమానాన్ని సుకుమార్ తన కామెంట్స్ ద్వారా చాటుకున్నారనే చెప్పాలి.

రంగస్థలం సినిమాలో( Rangasthalam ) హీరో రోల్ లో చరణ్ అద్భుతంగా చేశారని ఆ రోల్ లో చరణ్ ను తప్ప మరో నటుడిని ఊహించుకోవడం కూడా సాధ్యం కాదని సుకుమార్ అన్నారు.ఈ విషయం చరణ్ తో కూడా చాలాసార్లు చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా మాత్రం సమంతను అనుకోలేదని చరణ్ కు జోడీగా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలని భావించానని ఆయన వెల్లడించడం గమనార్హం.

-Movie

హీరోయిన్ కూడా స్టార్ అయితే సెట్ మేనేజ్ చేయలేనేమో అనే ఫీల్ కలిగిందని సుకుమార్ పేర్కొన్నారు.చివరకు సమంత అయితే పల్లెటూరి అమ్మాయిగా( Village Girl Role ) బాగా చేస్తుందని ఆమెను ఎంపిక చేశానని ఆయన అన్నారు.షూటింగ్ సమయంలో సమంత నటన చూసి ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు.

ప్రతి సీన్ లో సామ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు అద్భుతమని సుకుమార్ పేర్కొన్నారు.

-Movie

రంగస్థలం ఆడియో లాంఛ్ ఈవెంట్ లో ఒకే మాట చెప్పానని నేను సినిమాలు చేసినంత కాలం సామ్ ను తీసుకుంటూ ఉంటానని అన్నానని సుకుమార్ వెల్లడించారు.సమంత వయస్సుకు తగ్గ రోల్ నా సినిమాలో ఇస్తానని ఆయన పేర్కొన్నారు.లిప్ లాక్ సీన్( Lip lock ) కూడా ఆ సినిమాకు అవసరం కాబట్టే పెట్టామని సుకుమార్ వెల్లడించారు.

సుకుమార్ మాట ఇచ్చినట్టే సమంతకు పుష్ప ది రైజ్ లో ఛాన్స్ ఇచ్చారు. పుష్ప ది రూల్( Pushpa The Rule ) లో కూడా సామ్ కనిపిస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube