బాహుబలి ఆర్టిస్ట్ కు క్యాన్సర్.. ఆ మాత్రం డబ్బు కూడా లేదా అంటూ నెటిజన్స్ ట్రోల్!

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది.

 Director Ss Rajamouli Humble Request Donate Funds Devika, Ss Rajamouli, Devi, Fund Raising, Bhahubali-TeluguStop.com

బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.రాజమౌళి దర్శకత్వం చేస్తున్నాడంటే అభిమానుల్లో ఆ సినిమా మీద అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

 Director Ss Rajamouli Humble Request Donate Funds Devika, SS Rajamouli, Devi, Fund Raising, Bhahubali-బాహుబలి ఆర్టిస్ట్ కు క్యాన్సర్.. ఆ మాత్రం డబ్బు కూడా లేదా అంటూ నెటిజన్స్ ట్రోల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది.

ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ప్రతిసారీ నిరాశే మిగులుతోంది.ఇప్పటికే ఈ సినిమా విడుదల మూడు సార్లు వాయిదా పడింది.అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటీవల రాజమౌళి ట్విట్టర్ ద్వారా బాహుబలి సినిమాలో తనతోపాటు కలిసి పనిచేసిన ఆర్టిస్ట్ కోసం సహాయం కోరాడు.రాజమౌళి ట్వీట్ చేస్తూ “బాహుబలి సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేసిన దేవిక అనూ ఆర్టిస్ట్ దురదృష్టవశాత్తు బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది.ఇక్కడ నేను షేర్ చేస్తున్న kETO ఫండ్ రైజింగ్ కి ఆమె కోసం మీ వంతు సహాయం అందించాలని కోరుకుంటున్నాను”.

ఈ తరుణంలో రాజమౌళి ఆమె ఫోటోను కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.అయితే కొందరు నెటిజన్లు మాత్రం రాజమౌళి చేసిన ట్వీట్ కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో డబ్బు సంపాదించే మీకు ఆమె ఆపరేషన్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా చాలా మంది నెటిజన్లు రాజమౌళిపై కామెంట్ చేస్తూ పెద్ద ఎత్తున అతనిని ట్రోల్ చేస్తున్నారు.

మరి ఈ విషయంపై జక్కన్న స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Video : Director Ss Rajamouli Humble Request Donate Funds Devika, SS Rajamouli, Devi, Fund Raising, Bhahubali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube