డైరక్టర్ శ్రీను వైట్లకు పితృవియోగం..!

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల ఇంట విషాదం అలముకుంది.శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది.

 Srinu Vaitla Father Krishnarao Passed Away Details, Srinu Vaitla, Director Srinu-TeluguStop.com

ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.స్వస్థలం ఈస్ట్ గోదావరి జిల్లా కందులపాలెంలో ఉంటున్న కృష్ణారావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఈరోజు తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు.కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.

శ్రీను వైట్ల హైదరాబాద్ లో ఉంటున్నారు.విషయం తెలుసుకున్న ఆయన ఊరికి బయలుదేరినట్టు తెలుస్తుంది.శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసిన తమ సంతాపం తెలియచేస్తున్నారు.స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీను వైట్ల ఈమధ్య కెరియర్ పరంగా వెనకపడ్డారు.

ప్రస్తుతం మంచు విష్ణుతో ఢీ ఢీ సినిమా చేస్తున్నారు.వీరి కాంబినేషన్ లో వచ్చిన ఢీ సినిమా హిట్ అయ్యింది.

ఆ సెంటిమెంట్ తో ఈ డబుల్ ఢీ వస్తుంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.

మంచు విష్ణు కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube