వైట్ల దృష్టి ఆ సినిమాలపై పడ్డట్లుందిగా..!  

‘దూకుడు’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాతో సక్సెస్‌ను దక్కించుకోలేక పోయిన దర్శకుడు శ్రీనువైట్ల. ఆ చిత్రం తర్వాత స్టార్‌ హీరోలతో వైట్ల సినిమాను తెరకెక్కించాడు. ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌లతో సినిమాలు చేసిన ఈయన ఒక్కటైన సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయాడు. తాజాగా రవితేజతో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు వైట్ల మాట్లాడుతూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.

Director Srinu Vaitla Eye Biopic Movies-Biopic Movies Director Mahanati

Director Srinu Vaitla Eye Biopic Movies

వైట్ల మాట్లాడుతూ.. ఈమద్య నేను ‘మహానటి’ చిత్రాన్ని చూశాను. ఎంతో అద్బుతంగా ఆ సినిమాను చేశారు. అన్ని విధాలుగా ఆ సినిమా నాకు నచ్చింది. నేను భవిష్యత్తులో అటువంటి సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను అన్నాడు. బయోపిక్‌ల వల్ల ప్రేక్షకులకు గొప్పవారి గురించి పూర్తిగా తెలియజేసే అవకాశం ఉందని, అందుకే తాను ఆ దారిలో వెళ్లాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎంతో మంది స్టార్స్‌ బయోపిక్‌లు వస్తున్నాయి. శ్రీనువైట్ల కూడా ఎవరిదో ఒకరి బయోపిక్‌ మొదలు పెట్టేలా ఉన్నాడు.

Director Srinu Vaitla Eye Biopic Movies-Biopic Movies Director Mahanati

బయోపిక్‌ లు అంటే చాలా సీరియస్‌ గా సాగుతాయి. కాని వైట్ల నుండి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఆశిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో వైట్ల ఎలా న్యాయం చేయగలడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కి నేడు విడుదలైన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమా ఫలితాన్ని బట్టి ఆయన కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. వైట్ల త్వరలోనే వెబ్‌ సిరీస్‌లను కూడా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.