@Love Movie Review: @లవ్ మూవీ రివ్యూ: ఆకట్టుకునే ఎమోషనల్ లవ్ డ్రామా !

శ్రీ నారాయణ దర్శకత్వంలో తాజాగా చిత్రం @లవ్. ఇందులో అభి, సోనాక్షి, రామరాజు తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

 Director Sri Narayana At The Rate Love Movie Review And Rating Details, @love Mo-TeluguStop.com

ఈ సినిమాకు మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల,శ్రీనారాయణ నిర్మాతలుగా వ్యవహరించారు.శ్రీ నారాయణ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

మరి విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.అలాగే ఈ సినిమాలో కథ ఏమిటి? సాంకేతికత ఎలా ఉంది ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కథ :

కథ విషయానికి వస్తే.ఈ సినిమా గిరిజన నేపథ్యంలో తాగి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా రూపొందింది.

ఇందులో ఎమ్మెల్యే శర్మ (రామరాజు) తన కూతురు విందు రామ్ అనే ఒక గిరిజన యువకుడిని ప్రేమించిందని తెలిసి వారి ప్రేమను చెడగొట్టడం కోసం గిరిజన ప్రాంతానికి బయలుదేరుతాడు.తర్వాత జరిగే కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే శర్మకు ఒక గిరిజన పెద్దాయన పరిచయమవుతాడు.

అప్పుడు అతను గతంలో గిరిజన ప్రాంతంలో జరిగిన ఒక ప్రేమజంట తాలూకా జరిగిన కథ గురించి వివరిస్తాడు.అయితే ఆ పెద్దాయన చెప్పిన తర్వాత శర్మ లో ఎటువంటి మార్పు వచ్చింది? చివరికి శర్మ తన కూతురు ప్రేమను అంగీకరిస్తాడా లేదా? అదేవిధంగా ఆ పెద్దాయన చెప్పిన విధంగా అప్పటి ప్రేమ జంటకు అలాగే శర్మ కూతురు ప్రేమ జంటకు మధ్య సంబంధం ఏమైనా ఉందా? అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

Telugu @love Movie Rating, @love Movie Review, @love Movie Story, Abhi, Sri Yana

నటీనటుల నటన :

ఈ సినిమాలో సున్నితమైన అంశాలతో ఎమోషన్స్ పండించే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనుంది.అలాగే ఇందులో నటీనటుల నటనకు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పవచ్చు.

టెక్నికల్:

శ్రీ నారాయణ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.అలాగే ఇందులో ప్రతి సీక్వెన్స్ కి ఒక ఎమోషనల్ సీన్ తో సినిమా పై ఆసక్తిని పెంచారు.

ఫీల్, ఎమోషన్, ఆడవాళ్ళ కి సంబంధించిన సోషల్ మెసేజ్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు.అలాగే నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది.

సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి.

Telugu @love Movie Rating, @love Movie Review, @love Movie Story, Abhi, Sri Yana

విశ్లేషణ:

ఈ సినిమా చూస్తున్నంత సేపు అందమైన అడవి మధ్యలోకి వెళ్లి అక్కడి పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.అలాగే దర్శకుడు శ్రీ నారాయణ రాసుకున్న సున్నితమైన ప్రేమ కథలు కూడా ఈ సినిమాకు ప్రధాన బలం.ముఖ్యంగా ఆయన భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన ఫీల్ ను అండ్ ఎమోషన్స్ ను పండించిన విధానం అబ్బురపరుస్తుంది.అలాగే ఇండల్ ఉండే రెండు ప్రేమ కథలు కూడా ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తాయి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ప్రధానమైనది ఈ కథ జరిగిన నేపధ్యమే.అలాగే మ్యూజిక్, సాంకేతిక నిపుణుల పనితీరు, నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ సినిమాలో కొన్ని సన్నివేశాలలో కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది

బాటమ్ లైన్:

మనసులను కదిలించే స్వచ్చమైన ప్రేమ కథ. మొత్తానికి ఈ సినిమా కొత్త రకం మంచి సినిమాలను కోరుకునే వారికి మంచి ఛాయిస్ అవుతుంది.

రేటింగ్: 3.25 /5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube