జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పిలిచి ఆ మాట చెప్పారు... రౌడీ బాయ్స్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Director Sri Harsha About Rowdy Boys Movie

దర్శకుడు శ్రీ హర్ష దర్శకత్వంలో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం రౌడీ బాయ్స్.ఈ సినిమా నేడు సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల అయ్యింది.

 Director Sri Harsha About Rowdy Boys Movie-TeluguStop.com

అయితే ఈ సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో చిన్న చిన్న సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది.ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి ఆశిష్, గల్లా అశోక్ హీరోలుగా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు.

అయితే ఈ హీరోలు ఇద్దరు నటించిన రౌడీ బాయ్స్,హీరో సినిమాలు నేడు సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నాయి.

 Director Sri Harsha About Rowdy Boys Movie-జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పిలిచి ఆ మాట చెప్పారు… రౌడీ బాయ్స్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వీరిద్దరిలో ఎవరు సక్సెస్ అందుకుంటారు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక జనవరి 14న రౌడీ బాయ్స్ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీ హర్ష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.రౌడీ బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం అందరికి తెలిసిందే.

దర్శకుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఎన్టీఆర్ ఇంటికి పిలిస్తే వెళ్ళాం.

నా ఫస్ట్ మూవీ హుషారు అని చెప్పగా ఎన్టీఆర్ నన్ను మెచ్చుకున్నాడు.అలాగే రౌడీ బాయ్స్ ట్రైలర్ చూసి మొదట షాక్ అయ్యారు.

రెండు మూడు సార్లు చూశారు.ఆయన ఫ్యాన్స్ వల్లే మా మూవీ కి హైప్ వచ్చింది అని చెప్పుకొచ్చారు దర్శకుడు శ్రీహర్ష.అలాగే స్టైలిష్ స్టార్ మా సినిమా సాంగ్ రిలీజ్ చేయడం క్రేజీ మూమెంట్ అని చెప్పుకొచ్చారు హర్ష.ఈ సినిమాను అనిత సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ ని చూసి అభిమానులు కూడా ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

మరి అభిమానులు అనుకున్న విధంగా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవుతుందా లేదా తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

#NTR #Sri Harsha #Rowdy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube