టక్ జగదీష్ షూటింగ్ కొనసాగుతుంది… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు  

Director Siva Nirvana clarify Tuck Jagadish shooting, Tollywood, Telugu Cinema, Siva Nirvana, Hero Nani, Ritu Varma, Aishwarya Rajesh - Telugu Aishwarya Rajesh, Director Siva Nirvana Clarify Tuck Jagadish Shooting, Hero Nani, Ritu Varma, Siva Nirvana, Telugu Cinema, Tollywood

నిన్ను కోరి, మజిలీ లాంటి ఫీల్ గుడ్ చిత్రాలతో అలరించిన దర్శకుడు శివ నిర్వాణ నుంచి వస్తున్న మూడో సినిమా టక్ జగదీష్.ఈ సినిమా ఎప్పుడో లాక్ డౌన్ కి ముందే స్టార్ట్ అయ్యింది.అయితే కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది.లాక్ డౌన్ సడలింపులు అనంతరం కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో నానికి జోడీగా తెలుగు హీరోయిన్స్ గా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ చేస్తున్నారు.జగపతిబాబు ఓ కీలక పాత్రలలో కనిపంచనున్నారు.

TeluguStop.com - Director Siva Nirvana Clarify Tuck Jagadish Shooting

ఇదిలా ఉంటే టక్ జగదీష్ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.యూనిట్ లో ఓ టెక్నీషియన్ కరోనా బారినపడడంతో ముందు జాగ్రత్తగా చిత్రీకరణ ఆపివేశారని ప్రచారం జరిగింది.

కరోనా కారణంగా టీం మొత్తం హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయిందని టాక్ వినిపించింది.అయితే టక్ జగదీష్ సినిమాపై వచ్చిన రూమర్స్ ని దర్శకుడు శివ నిర్వాణ ఖండించాడు.

TeluguStop.com - టక్ జగదీష్ షూటింగ్ కొనసాగుతుంది… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

షూటింగ్ ఆగిపోలేదని, కొనసాగుతోందని ఓ వీడియో విడుదల చేశారు.టక్ జగదీష్ ను ఆపలేరు.38వ రోజున సెట్స్ పై ఇలా అంటూ శివ ట్వీట్ చేశారు.టక్ జగదీష్ సెట్స్ లో శానిటైజర్ యంత్రాలతో శుద్ధి చేస్తున్న వీడియోని శివ షేర్ చేశాడు.

ఇదిలా ఉంటే వి ఫ్లాప్ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇది కావడంతో దీని మీద గట్టి హోప్స్ పెట్టుకొని ఉన్నాడు.నాని కెరియర్ లో గత నాలుగు సినిమాలు ఏవరేజ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

దీంతో టక్ జగదీష్ తో సాలిడ్ హిట్ కొట్టాలని నాని అనుకుంటున్నాడు.

#Siva Nirvana #Hero Nani #Ritu Varma #DirectorSiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Siva Nirvana Clarify Tuck Jagadish Shooting Related Telugu News,Photos/Pics,Images..