విజయ్ 'ఖుషీ' షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

Director Shiva Nirvana Gives Khushi Movie Update, Director Shiva Nirvana, Khushi Movie Update, Khushi Movie, Vijay Deverakonda, Samantha

టాలీవుడ్ యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన చాలా కస్టపడి పైకి వచ్చాడు.

 Director Shiva Nirvana Gives Khushi Movie Update, Director Shiva Nirvana, Khushi-TeluguStop.com

ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా తర్వాత వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఈయనపై అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఈ మధ్యనే విజయ్ బయట పడ్డాడు.ఆ తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకుంటూ ప్లాప్స్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇక ప్రెజెంట్ విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న సినిమా ‘ఖుషీ’.ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్టర్ చేస్తున్నాడు.సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.అయితే కొన్నాళ్ల నుండి ఈ సినిమా షూట్ ఆగిపోయింది. లైగర్ ప్రమోషన్స్ కారణంగా ఆగిపోయిన ఈ షూట్ మళ్ళీ సామ్ హెల్త్ కారణంగా ముందుకు వెళ్ళలేదు.

దీంతో సామ్ కారణంగా ఈ సినిమాపై చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.మరి ఈ రూమర్స్ కు డైరెక్టర్ చెక్ పెట్టే ప్రయత్నం చేసాడు.ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇస్తూ.రెగ్యురల్ షూట్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తాం అని.అంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని తెలిపాడు.దీంతో విజయ్ ఫ్యాన్స్ కు ఈ అప్డేట్ ఊరట కలిగించింది అనే చెప్పాలి.

మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube