శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో?

Director Shankar Son In Law Rohit Damodaran Booked Molestation Case

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో గుర్తింపును సొంతం చేసుకున్న శంకర్ కు ఇతర భాషల్లో, విదేశాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.ఈ ఏడాది జూన్ నెలలో శంకర్ తన కూతురికి ప్రముఖ క్రికెట్ రోహిత్ దామోదరన్ తో పెళ్లి చేశారు.

 Director Shankar Son In Law Rohit Damodaran Booked Molestation Case-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో ఘనంగా ఈ పెళ్లి వేడుక జరగగా ఈ వేడుకకు తమిళనాడు సీఎం కూడా హాజరయ్యారు.అయితే తాజాగా శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

పుదుచ్చేరి పోలీసులు రోహిత్ తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారని సమాచారం అందుతోంది.పోక్సో చట్టం కింద పోలీసులు ఈ కేసును నమోదు చేసినట్టు తెలుస్తోంది.

 Director Shankar Son In Law Rohit Damodaran Booked Molestation Case-శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోహిత్ దామోదరన్ 16 సంవత్సరాల మైనర్ బాలికను వేధించారనే ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు.బాధిత బాలిక తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పుదుచ్చేరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత బాలిక తాను క్రికెట్ కోచింగ్ కొరకు వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చారు.

Telugu Cricket, Cricketerrohith, Shankar, Minor, Puduchhery, Rohit Damodaran, Shankar Son Law-Movie

వేధింపులకు సంబంధించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధిత బాలిక చైల్డ్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.అయితే పోలీసులు క్రికెటర్ రోహిత్ దామోదరన్, అతని తండ్రి, కోచ్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Telugu Cricket, Cricketerrohith, Shankar, Minor, Puduchhery, Rohit Damodaran, Shankar Son Law-Movie

కొంతమంది నెటిజన్లు రోహిత్ దామోదరన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం.రోహిత్ దామోదరన్ ఈ ఆరోపణల గురించి స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.వైరల్ అవుతున్న వార్తల వల్ల రోహిత్ ఫ్యాన్స్ బాధ పడుతుండటం గమనార్హం.

శంకర్ ఈ కేసు విషయంలో స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

#CricketerRohith #Puduchhery #Shankar #Shankar #Cricket

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube