పక్షిరాజా పాత్ర ద్వారా రోబో2.0 తో శంకర్ ఇచ్చిన సందేశం ఇదే.! మనుషులందరికి ఇదో వార్నింగ్!  

భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సినిమా రోబో 2.ఓ. ఐదు వందల కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్, యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర హైలైట్. పక్షిరాజా పాత్రకు తనవంతు న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ లో సెల్ ఫోన్స్ ని మాయం చేసిన కాకిగా భయపెట్టారు..సెకండ్ హాఫ్ లో పక్షులను ప్రేమించే పక్షిరాజాగా ఎమోషన్ పండించారు. సినిమా మొత్తం పక్షిరాజా చెప్పిన మాట ఒక్కటే…సేవ్ బర్డ్స్. స్టాప్ సెల్ ఫోన్స్.

Director Shankar Message Pakshi Raja Role Robo 2 Movie-Pakshi Rajinikanth Movie

Director Shankar Message Pakshi Raja Role Robo 2 Movie

సెల్ ఫోన్స్ వల్ల వచ్చే హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ వల్ల పక్షుల జాతి అంతరిస్తుంది. పక్షులు లేకుంటే జీవసృష్టి ఉండదు. ఎందుకంటే పంటలు పాడు చేసే పురుగుల్ని తినేది పక్షులే. పక్షులు లేక పంటలకు కెమికల్ మందులు కొడుతున్నారు. తద్వారా పోషక ఆహారాలు లోపిస్తున్నాయి. దీనివల్ల అనేక జబ్బులు.

ఈ ప్రపంచంలో ఓ ముప్పై గ్రాముల పిచుక కూడా బతకలేకుంటే మన టెక్నాలజీ ఎందుకు అనేదే శంకర్ సందేశం. సెల్ ఫోన్ వినియోగదారుల సౌకర్యం కోసం రేంజ్ కి మించి ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపిస్తున్నారు సెల్ ఫోన్ కంపెనీలు. అవి అదుపు చేయాలనేది ఈ సినిమా ద్వారా శంకర్ ఇచ్చిన సందేశం.

మరో దేశంనుంచి వేలాది కిలమీటర్ల నుంచివచ్చే పక్షులు భారతదేశంలోని ఓ గ్రామానికి రావడం.. కేవలం ప్రకృతిలో భాగంగా అవి వాటి మెదడుతో దారులను గుర్తుపెట్టుకొని అన్ని వేలాది కిలోమీటర్లు వస్తాయని శంకర్ కొన్ని మరచిపోతున్నవిషయాల్ని అర్థమయ్యేలా చెప్పాడు. కమర్షియల్ ఎలెమెంట్స్ ని చూపిస్తూనే ఈ సందేశంని ప్రజలకు చేరువచేయడంలో శంకర్ సఫలమయ్యారు.