చరణ్ సినిమా పక్కకు పెట్టి మళ్లీ చెన్నై వెళ్లిన శంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఈనెల రెండవ వారంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.ఊటీ మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరిగింది.

 Director Shankar Join Indian 2 Movie Shooting After Rc 15 Details, Kamal Hasan,-TeluguStop.com

రెండు వారాల షూటింగ్ జరిగిందో లేదో అప్పుడే దర్శకుడు శంకర్ చెన్నై చెక్కేశాడు.అక్కడ నేటి నుండి కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.

ఒకే సారి రెండు సినిమాల చిత్రీకరణ ఎలా చేస్తున్నాడంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.మరి కొందరు ఇవేమైనా పాత రోజుల అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొదట మా రామ్ చరణ్ సినిమా పూర్తి చేసిన తర్వాత ఇతర సినిమాల సంగతి చూడాలంటూ మెగా అభిమానులు శంకర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.కానీ గతం లోనే మొదలు పెట్టిన ఇండియన్ 2 సినిమా ఇప్పుడు పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కనుక రెండు సినిమాలను ఏక కాలంలో పూర్తి చేసేందుకు దర్శకుడు శంకర్ సిద్ధమయ్యాడు.అందులో భాగంగానే ఒక షెడ్యూల్ తర్వాత మరోటి అన్నట్లు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాడు.

Telugu Indian, Kamalhasan, Kamal Hassan, Kamal, Fans, Telugu, Rc-Movie

శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేస్తుండగా వచ్చే నెల రెండవ వారం నుండి మళ్లీ రామ్ చరణ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నాడు.మొత్తానికి దర్శకుడు శంకర్ రెండు సినిమాలను ఒకే సారి చేస్తూ అక్కడ ఇక్కడ ఒకే సారి సినిమాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.రామ్ చరణ్ తో చేసిన సినిమా వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కనుక ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మరి ఇండియన్ 2 ఎప్పుడు వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube