సినిమా పరిశ్రమల వారసులు, వారసురాళ్లతో నిండిపోతుంది.ఇప్పటికే పలువురు నటీనటుల కొడుకులు సినిమా హీరోలుగా పరిచయం కాగా.
కొందరి అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.మెగా ఫ్యామిలీ నుంచి నీహారిక.
మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మీ, రాజశేఖర్ ప్యామిలీ నుంచి శివానీ, శివాత్మిక, క్రిష్ణ ఫ్యామిలీ నుంచి మంజుల వెండి తెరపై దర్శనం ఇచ్చారు.బాలీవుడ్ లో అయితే వారసురాళ్ల డామినేషన్ కొనసాగుతుంది.
అటు తమిళంలో కమల్ హాసన్, అర్జున్, శరత్ కుమార్ బిడ్డలు హీరోయిన్లుగా వెండితెరపై సందడి చేశారు.ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ కూతరు కూడా హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
ఇంతకీ తను పరిచయం అయ్యే సినిమా వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కార్తి హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో శంకర్ ముద్దుల కూతురు అదితి హీరోయిన్ గా చేస్తుంది.ఈ విషయాన్ని శంకర్ అధికారికంగా ప్రకటించాడు.
విరుమన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2డీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు.అటు తన కూతురును హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య, జ్యోతిక, కార్తికి శంకర్ ధన్యవాదాలు చెప్పాడు.

విజయ్ తండ్రి చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు శంకర్.ఆ తర్వాత అర్జున్ తో జెంటిల్ మెన్ అనే సినిమా చేశాడు.ఈ సినిమా అప్పట్లో దక్షిణాదిలో సంచలన విజయం సాధించింది.ఆ తర్వాత శంకర్ ఓ రేంజిలోకి వెళ్లిపోయాడు.రోబో సినిమాతో ఎదురులేని దర్శకుడిగా మారిపోయాడు.

అటు ఇప్పటి వరకు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయని శంకర్.తాజాగా ఆప్రయత్నం చేస్తున్నాడు.రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది.ప్రస్తుతం అపరిచితుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.
అటు కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు-2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్.ఈ సినిమా త్వరలోనే కంప్లీట్ కానుంది.