నేనే వస్తున్న రివ్యూ: ధనుష్ సైకో థ్రిల్లర్ వెరీ స్లో గురు!

డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా నేనే వస్తున్నా. ఈ సినిమాలో ధనుష్, ఎలీ అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, ప్రభు, యోగి బాబు, సెల్వ రాఘవన్, షెల్లి కిషోర్, శరవణ సుబ్బయ్య తదితరులు నటించారు.

 Director Selva Raghavan Hero Dhanush Nene Vasthunna Movie Review And Rating Deta-TeluguStop.com

ఇక ఈ సినిమాకు కలైపులి ఎస్.థాను నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఫస్ట్ లుక్స్ పరీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా ధనుష్ కు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

కథ:

ఇందులో ధనుష్ ప్రభు పాత్రలో కనిపిస్తాడు.ఇతనిది సంతోషమైన కుటుంబం.

అంతేకాకుండా అర్థం చేసుకునే భార్య.మంచి కూతురు.

ప్రభుకు ఈ ఇద్దరి ప్రపంచం.అయితే సంతోషంగా సాగుతున్న ఈ కుటుంబానికి ఓ దెయ్యం వల్ల కొన్ని సంఘటనలు ఎదురవుతాయి.

దాని పేరు సోనూ.సోనూ ప్రభు కూతుర్ని ఆవహించి తనను అశక్తురాన్ని చేస్తుంది.

ఇక ఆ పాపను వీడాలి అంటే ఖదీర్ ను అంతమందించాలి అని షరతు పెడుతుంది.ఇక ఆ ఖదీర్ ఎవరంటే ప్రభుకు సోదరుడు.

వారిద్దరూ కవలలు.అయితే ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు.

ఇంతకు ఆ దయ్యం ఆ ఖదీర్ ను అంతమొందించాలని చూసింది.చివరికి ప్రభు తన కూతురి ని పట్టిన ఆ సోనూ ని ఎలా వదులుతాడు అనేది మిగిలిన కథలోనిది.

Telugu Dhanushnene, Selva Raghavan, Dhanush, Nene Vasthunna, Nenevasthunna, Psyc

నటినటుల నటన:

నటీనటుల విషయానికి వస్తే ధనుష్ తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా తండ్రి పాత్రలో లీనమయ్యాడు.ఇక మరో పాత్ర సైకో పాత్రలో కూడా అద్భుతంగా తన విలనిజం చూపించాడు.ధనుష్ కూతురుగా నటించిన అమ్మాయి కూడా తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా డైరెక్టర్ సెల్వ రాఘవన్ మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.కానీ కథలు మరిన్ని మలుపులు జోడిస్తే కథ మరింత బాగుండేది.యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది.ఓం ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.మిగిలిన నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా పనిచేస్తాయి.

Telugu Dhanushnene, Selva Raghavan, Dhanush, Nene Vasthunna, Nenevasthunna, Psyc

విశ్లేషణ:

ఈ సినిమా సైకోథ్రిల్లర్ తో పాటు హారర్ నేపథ్యంలో రూపొందించాడు డైరెక్టర్.ఇక ఇద్దరు కవలలైన సోదరులలో ఒకరుమంచి వ్యక్తి అయితే మరొకరు సైకో.అలా వదిలేసిన కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఈ స్టోరీ బాగా ఆస్కారం ఉన్న కథ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:

కథ, ధనుష్ నటన, ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, ట్విస్ట్.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ సాగినట్లు అనిపించింది.కొన్ని మలుపులు కూడా లేకుండా ఉన్నాయి.

బాటమ్ లైన్:

థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ముఖ్యంగా ఇటువంటి కాన్సెప్ట్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube