లవ్ స్టోరీ లో సాయి పల్లవితో ఆ విషయం చెప్పిస్తున్న శేఖర్ కమ్ముల

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న అందాల భామ సాయి పల్లవి.తెలుగులో మహానటి సావిత్రి, సౌందర్య తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్న నటిగా సాయి పల్లవికి అరుదైన గుర్తింపు ఉంది.

 Director Sekhar Kammula Touch The Female Issue In Love Story Movie, Tollywood, S-TeluguStop.com

ఆమె సినిమాల ఎంపిక, నటన, డాన్స్ లకి పెద్దవాళ్ళ నుంచి టీనేజ్ యువత వరకు అందరూ ఫిదా అయిపోతున్నారు.హీరోయిన్స్ అందరూ స్టార్ హీరోలకి జోడీగా నటించే అవకాశాల కోసం ఎదురుచూస్తే సాయి పల్లవి మాత్రం తనకు కంటెంట్, తన సినిమాలో తన పాత్ర ముఖ్యం అని మొండిగా సినిమాలు చేస్తుంది.

అందుకే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు వచ్చిన గ్లామర్, కేవలం పాటలకి పరిమితం అయ్యే పాత్రలు చేయడం ఇష్టంలేక వాటిని వదిలేసుకుంటుంది.సాయి పల్లవికి యూత్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని దర్శక, నిర్మాతలు కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

దానికోసం కథలో హీరోయిన్ పాత్ర ప్రాధాన్యత పెంచుతున్నారు.

Telugu Sekhar Kammula, Female, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Tollywoo

ప్రస్తుతం సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న లవ్ స్టోరీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా నుంచి వచ్చిన ఫోక్ సాంగ్ సారంగాదరియా సూపర్ హిట్ కావడంతో సినిమా మీద హైప్ పెరిగింది.

దానికితోడు ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ కావడంతో మరింత క్రేజ్ ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కాన్సెప్ట్ పల్లెటూరిలో కులాంతర ప్రేమకథగా ఉండబోతుందని తెలుస్తుంది.

అలాగే టీనేజ్ ఆడవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ సమస్యని ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ద్వారా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఆ అంశం ఏంటి.

దానిని ఏ కోణంలో శేఖర్ కమ్ముల ప్రెజెంట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube