లీడర్ రానాతో అందుకే తీశా.. సీక్రెట్ చెప్పేసిన శేఖర్ కమ్ముల..?

సాధారణంగా స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి ఎవరైనా కొత్తగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటే రిస్క్ లేని కథలలో నటించడానికి ఆసక్తి చూపుతారు.అయితే దగ్గుబాటి రానా మాత్రం లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 Sekhar Kammula Speech In Aranya Movie Pre Release Event , Aranya Movie, Leader M-TeluguStop.com

తొలి సినిమాలోనే సీఎం పాత్రలో నటించి నటుడిగా మెప్పించారు.లీడర్ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా రానా కెరీర్ కు మాత్రం ప్లస్ అయిందనే చెప్పాలి.

ప్రస్తుతం రానా అరణ్య సినిమాతో పాటు విరాటపర్వం సినిమాలలో నటించగా నిన్న అరణ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ అరణ్య డైరెక్టర్ ప్రభు రానా ముఖం చూసి ఈ సినిమాకు అతనిని హీరోగా ఎంపిక చేశానని చెప్పారని అయితే తాను మాత్రం రానా గొంతు విని లీడర్ సినిమాకు అతనిని ఎంపిక చేశానని అన్నారు.

లీడర్ సినిమా రిలీజై పది సంవత్సరాలు అవుతోందని శేఖర్ కమ్ముల తెలిపారు.

Telugu Aranya, Aranya Pre, Prabhu, March, Pre, Rana, Sekhar Kammula, Sekharkammu

రానా ఎప్పుడూ వేర్వేరు గెటప్స్ లో కనిపిస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటారని శేఖర్ కమ్ముల అన్నారు.పిల్లలకు, ఫ్యామీలీలకు అరణ్య సినిమా ఎంతగానో నచ్చుతుందని.అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోందని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

అరణ్య మూవీలో రానా నటన బాగుంటుందని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.మార్చి 26వ తేదీన అరణ్య సినిమా విడుదల కానుంది.

నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా కూడా అదే రోజు విడుదల కానుండగా రెండు సినిమాలు వేర్వేరు జోనర్లలో తెరకెక్కడంతో ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న అరణ్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube