తన వాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి!  

మహిళలల్ని కించపరిచిన వాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి.

Director Sandeep Reddy Responds On Actress Fire-arjun Reddy,bollywood,director Sandeep Reddy,kabhir Singh,tollywood

అర్జున్ రెడ్డి రీమేక్ గా హిందీలో తెరకెక్కిన కబీర్ సింగ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ మరో సారి సందీప్ రెడ్డికి డబుల్ ప్రమోషన్ గా దొరికింది. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో సందీ రెడ్డి చేరిపోయాడు..

తన వాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి!-Director Sandeep Reddy Responds On Actress Fire

దీంతో అక్కడ ఈ తెలుగు దర్శకుడుకి అవకాశాలు భాగానే వస్తున్నాయి. ఇక ఈ సినిమా మీద కొంత మంది మహిళా సెలబ్రిటీలు కాస్తా ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమాలో సన్నివేశాలు మరీ శృతి మించి ఉన్నాయని కామెంట్ చేసారు.

అలాగే డాక్టర్లు కబీర్ సింగ్ సినిమా తమ వృత్తిని అవమానించినట్లు ఉన్నాయని కేసు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు కొట్టుకోవడం సహజం అనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ వాఖ్యలు మహిళా మణులకి కోపం తెప్పించాయి.

సందీప్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా వంటి వారు సోషల్‌మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా సందీప్ స్పందించారు. నా మాటలను మీడియా తప్పుగా భావించింది.

ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ ఉండదని తన భావన. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు.

మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను వేరే రకంగా అర్ధం చేసుకోవడం వలన ఇప్పుడు మహిళలల్ని కించపరిచాను అని అంటున్నారు అని చెప్పుకొచ్చాడు. మరి దీనిపై మన నటీమణులు కోపం తగ్గుతుందో లేదో చూడాలి.