ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య( Anand Devarakonda, Vaishnavi Chaitanya ) హీరో హీరోయిన్లుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన బేబీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.అయితే ఈ సినిమా విషయంలో కొన్ని బూతులను ప్రధాన పాత్రల చేత మాట్లాడించడం పంటి కింద రాయిలా తగులుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొన్ని బూతులు మ్యూట్ అయినా మరికొన్ని బూతులు మాత్రం మ్యూట్ కాలేదు.బేబీ( Baby ) మూవీని చూసే సమయంలో సెన్సార్ బోర్డ్ సభ్యులు నిద్రపోతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా గురించి వ్యక్తమవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.బేబీ సినిమా జీరో రిస్క్ అని అనిపించిందని ఆయన అన్నారు.
పరిస్థితులే విలన్స్ అనేలా ఈ సినిమాను తెరకెక్కించానని సాయి రాజేశ్( Sai Rajesh ) వెల్లడించారు.ఆ బూతును మాట్లాడితే ప్రేమించినవాడి క్యారెక్టర్ దిగజారినట్టు అని అయితే ఆ పాత్రకు విజిల్స్ వినిపించాయని ఆయన పేర్కొన్నారు.బేబీ క్లైమాక్స్ లో ఆనంద్ ను వైష్ణవి అలానే చూస్తుంటుందని అయితే లైఫ్ లో మూవ్ ఆన్ కావాలని సాయి రాజేశ్ వెల్లడించారు.అంత జరిగినా ఆ అమ్మాయి ఫోటో అతని దగ్గర ఉందని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.
వైష్ణవి మొదట చేయలేనని చెప్పిందని ఆయన అన్నారు.సేలంలో జరిగిన ఒక ఘటన ఆధారంగా ఈ సినిమా కథ పుట్టిందని సాయి రాజేశ్ అన్నారు.అమ్మాయి అలా అనడం న్యాయమేనని భావించి అమ్మాయి వాడిన బూతులను సెన్సార్ వాళ్లు వదిలేశారని రెండుసార్లు వదిలేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.మిగతా వర్డ్స్ అన్నీ మ్యూట్ అయ్యయని సాయి రాజేశ్ అన్నారు.