ప్రభాస్ తో తెరకెక్కించి లవ్ స్టొరీ గురించి సంచలన నిజాలు చెప్పిన దర్శకుడు  

ప్రభాస్ తో తెరకెక్కించే సినిమా కథ ఎలా ఉంటుందో చెప్పిన దర్శకుడు రాధాకృష్ణ. .

Director Reveal About Prabhas Movie Story-prabhas Movie Story,telugu,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ లో సాహో తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రంగా జాన్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన రోమ్ సిటీ సెట్ లో షూటింగ్ కి రెడీ అవుతుంది. ఇక పీరియాడికల్ లవ్ స్టొరీగా ఈ సినిమా ఉండబోతుంది అని, ఇందులో వింటేజ్ కార్ల వ్యాపారిగా ప్రభాస్ కనిపిస్తాడని చాలా కాలంగా టాక్ వినిపిస్తుంది..

ప్రభాస్ తో తెరకెక్కించి లవ్ స్టొరీ గురించి సంచలన నిజాలు చెప్పిన దర్శకుడు-Director Reveal About Prabhas Movie Story

ఇక ఇందులో పూజా హెగ్డేతో రొమాన్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుంది అనే చర్చ కూడా నడిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి చిత్ర దర్శకుడు రాదాక్రిష్ణ ఆసక్తికరమైన విషయాలతో మీడియాతో షేర్ చేసుకున్నాడు.

ఇది కాలాతీతంగా పునర్జన్మల నేపధ్యంలో నడిచే ప్రేమకథ చిత్రం అని, ఇది పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో పాటు, ప్రెజెంట్ నేటివిటీ కూడా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు తెలుగులో చూడనటువంటి కథనంతో ఈ సినిమా ఉంటుందని, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతుంది అని రాధాకృష్ణ చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ప్రభాష్, పూజా హెగ్డే కాకుండా ఇతర నటీనటులు ఎవరనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. మరి జాన్ సినిమాతో చాలా కాలం తర్వాత లవర్ బాయ్ గా కనిపిస్తున్న ప్రభాస్ ఎ మేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి. .