ఆ డైరక్టర్ చెప్పబట్టే అనసూయ జబర్దస్త్ నుంచి వచ్చేసిందా..?

యాంకరింగ్ తో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో నటిస్తూ వస్తున్న అనసూయ అక్కడ ఇక్కడ రెండు చేతులా సంపాదిస్తుంది.సినిమాలు కూడా ఏది పడితే అది చేయకుండా తనకంటూ ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ వస్తుంది.

 Director Reason For Anasuya Jabadasth Quit Anasuya, Jabadasth, Tollywood, Krish , Web Series-TeluguStop.com

జబర్దస్త్ యాంకర్ గా ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాలతోనూ అలరిస్తుంది.లేటెస్ట్ గా అనసూయ జబర్దస్త్ షో నుంచి కూడా బయటకు వచ్చేసింది.

అయితే అందరు స్టార్ మాలో ఆఫర్ రాగానే అనసూయ జబర్దస్త్ వదిలేసింది అని అనుకున్నారు.స్టార్ మాలో సూపర్ సింగ్ జూనియర్స్ షోకి హోస్ట్ గా సుధీర్ తో పాటుగా అన్సూయ చేస్తుంది.

 Director Reason For Anasuya Jabadasth Quit Anasuya, Jabadasth, Tollywood, Krish , Web Series-ఆ డైరక్టర్ చెప్పబట్టే అనసూయ జబర్దస్త్ నుంచి వచ్చేసిందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ షో నుంచి బయటకు రావడానికి స్టార్ మా సెకండ్ రీజన్ అంటున్నారు.మరి మొదటి రీజన్ ఏంటి అంటే అది ఓ దర్శకుడి సలహా మేరకు అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందట.

అదేంటి అంటే.సినిమాల్లో రాణించాలని అనుకుంటున్న అనసూయ విలక్షణమైన పాత్రలు చేస్తుంది.

త్వరలో తనే లీడ్ రోల్ గా ఓ మెగా వెబ్ సీరీస్ స్టార్ట్ అవుతుంది.క్రిష్ డైరక్షన్ లో రాబోతున్న ఈ వెబ్ సీరీస్ లో అనసూయ వేశ్య పాత్రలో నటించనుంది.

గురజాడ అప్పారావు రాసిన నవల ఆధారంగా తెరకెక్కే ఈ వెబ్ సీరీస్ లో అనసూయ మధురవాణి పాత్రలో నటిస్తుందట.ఈ వెబ్ సీరీస్ కోసమే అనసూయ జబర్దస్త్ నుంచి క్విట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ వెబ్ సీరీస్ డేట్స్ అడ్జెస్ట్ చేయడానికే ఆమె జబర్దస్త్ ని వదిలేసిందట.అంతేకాదు ఈ వెబ్ సీరీస్ తర్వాత అనసూయ రేంజ్ మారుతుందని అంటున్నారు.

క్రిష్ సలహా మేరకే అనసూయ ఈ డెశిషన్ తీసుకుందని తెలుస్తుంది.మరి జబర్దస్త్ వదిలేసిన అనసూయ కెరియర్ అనుకున్న విధంగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube