ఏందయ్యా ఇది : పవర్ స్టార్ ట్రైలర్ చూడడానికి కూడా డబ్బులు కట్టాలంట…  

Ram gopal varma, tollywood director, Power star movie trailer, telugu movie news, money for trailer watching - Telugu Money For Trailer Watching, Power Star Movie Trailer, Ram Gopal Varma, Telugu Movie News, Tollywood Director

ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన చిత్రాల మార్కెటింగ్ విషయంలో కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 Director Ram Gopal Varma Is Is Asking Money Pay For Watching Power Star Movie Trailer

అయితే ఈ చిత్రాన్ని ఈనెల 24వ తారీఖున ఆన్ లైన్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.కాగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్ర ట్రైలర్ ని చూసేందుకు కూడా దాదాపుగా 40 నుంచి 50 రూపాయలు టిక్కెట్ ధరలను నిర్ణయించి వసూలు చేయాలని యోచిస్తన్నాడట.దీంతో ఈ వార్తని ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో నెటిజన్లు బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

ఏందయ్యా ఇది : పవర్ స్టార్ ట్రైలర్ చూడడానికి కూడా డబ్బులు కట్టాలంట…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక మరికొందరు మాత్రం మామూలుగా ఆర్జీవీ సినిమాలను డబ్బులు పెట్టి సినిమా థియేటర్లలో చూడడమే దండగ అనుకుంటే ట్రైలర్ కి కూడా డబ్బులు చెల్లించాలంటే ఈ చిత్ర ట్రైలర్ ని రామ్ గోపాల్ వర్మ తప్ప మరెవరూ డబ్బులు పెట్టి చూడరని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినీ దర్శకులంతా ఖాళీగా గడుపుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆన్ లైన్ ద్వారా తన చిత్రాలను విడుదల చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు.

దీనికితోడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించే నటీనటులంతా కొత్తవారు కావడంతో పారితోషికం విషయంలో కూడా పెద్దగా ఖర్చు కానట్లు తెలుస్తోంది.అయితే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన  “నగ్నం” అనే చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించి దాదాపుగా 90 లక్షల రూపాయలకి పైగా వసూలు చేశాడు.

#Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Ram Gopal Varma Is Is Asking Money Pay For Watching Power Star Movie Trailer Related Telugu News,Photos/Pics,Images..