నువ్వు చచ్చాక ఇవన్నీ మానేస్తానంటున్న వర్మ...

ఎప్పుడు విభిన్న కథనాలు ఎంచుకుంటూ, వివాదాలతో స్నేహం చేస్తూ,  ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియనివారుండరు.అయితే తాజాగా ఆర్జీవి “బ్యూటీఫుల్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న టువంటి విషయం తెలిసిందే.

 Director Ram Gopal Varma Arkb-TeluguStop.com

ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా ఆర్జీవి తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నెటిజన్లు ఆర్జీవిని ప్రశ్నలు అడిగారు.అయితే ఇందులో ఓ నెటిజన్ నువ్వు సినిమాలకి, సమాజానికి ఎప్పుడూ దూరంగా ఉంటావు అని సెటైరికల్ గా ప్రశ్న అడిగాడు.

దాంతో ఆర్జివి కూడా అంతే సెటైరికల్ గా సమాధానం ఇచ్చాడు.నువ్వు చచ్చినప్పుడు నువ్వు చెప్పినట్లు గానే నేను సినిమాలకు సమాజానికి దూరంగా ఉంటాను కాకపోతే ఇది జరిగే టప్పటికి నువ్వు బ్రతికి ఉండవు అందుకోసమీ నేను నీకు ముందుగానే నివాళులర్పిస్తున్నాను అంటూ సమాధానం చెప్పారు.

ఇది విన్న నెటిజన్ ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. 

Telugu Beautiful, Latestram, Ram Gopal Varma, Ramgopal-

 అయితే క్రమంలో మరో నెటిజన్ మీరు తీస్తున్న అట్లే మీ బయో పిక్ ని కూడా మరో దర్శకుడు నెగిటివ్ గా తీస్తే మీరు ఏం సమాధానం చెప్తారని అడిగాడు.దీంతో ఆర్జివి నేను బయోపిక్ ని తీయాలంటే ఎవరిని అడిగి తీయను.అందులో భాగంగానే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని తీసినప్పుడు చంద్రబాబునాయుడు అడగలేదు.

అలాగే లక్ష్మి’ s ఎన్టీఆర్ తీసినప్పుడు ఎన్టీ రామారావు ని లక్ష్మి పార్వతి ని అడగలేదు.కేవలం నా ఆలోచన ప్రకారమే తీసేసాను.అలాంటి స్వేచ్ఛ అందరికీ ఉండాలి నా బయోపిక్ తెస్తప్పుడు నా అనుమతి లేకుండా తీయొచ్చుని సమాధానం చెప్పారు.

అయితే గంటలో మీరు చనిపోతారని తెలిస్తే ముందుగా ఎం చేస్తారని అడిగాడు.

దాంతో నేను ఇంకో గంటలో చనిపోతానని తెలిస్తే స్వర్గంలో ఉన్న తనవాళ్లకు ఫోన్ చేసి నటి శ్రీదేవి సమాధి ప్రక్కనే తనకు ఖాళీ స్థలం ఉంచమని అడుగుతానని హాస్యంగా సమాధానం ఇచ్చారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube