గద్దరన్న పాటకు ఆర్జీవీ స్టెప్పులు.. డ్యాన్స్ ఇరగదీశాడుగా!

తనకంటూ ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ని ఏర్పరుచొని.ఎప్పుడూ వివాదాలు పాలవుతూ ఉండే డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Director Ram Gopal Arma Dance On Gaddar Song Details, Rgv Dance On Gaddar Song,-TeluguStop.com

అయితే ఆయన ఎప్పుడూ తాజా రాజకీయ, సామాజిక విషయాలపై స్పందిస్తూ కాంట్రవర్సీ చేస్తుంటాడు.అలాగే తన సినిమా ప్రమోషన్ల విషయంలోనూ ఆయన ఇలాగే చేస్తుంటారు.

అందరిలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తూ.తన సినిమాని ప్రమోటే చేస్కుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఆయన కొండా సినిమా ప్రమోషన్ లో భాగంగా గద్దరన్న పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన కొండా సినిమా గురించి అందరికీ తెలిసిందే.

అయితే డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు.జూన్ 23వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.అందులో భాగంగానే వరంగల్ లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ. తుపాకీ చేత బట్టి, మెడలో ఎరుపు రంగు టవల్ వేస్కొని, తలకు క్యాప్ పెట్టుకొని కనిపించారు.

అంతేనా అదే గెటప్ లో అదిరిపోయే స్టెప్పులు వేశారు.అందులోనూ గద్దరన్న పాట కావడం, ఆర్జీవీ డ్యాన్స్ చేయడంతో అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఎప్పుడూ అమ్మాయిలతో డ్యాన్స్ చసే రాం గోపాల్ వర్మ… ఇలాంటి పాటకు స్టెప్పులు వేయడం చూసి జనాలు షాక్ అవుతున్నారు.

మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube