ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ మాములుగా లేదుగా...  

Director Rajamouli RRR Movie motion poster Talk, NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR movie motion poster - Telugu Ajay Devgn, Alia Bhatt, Director Rajamouli Rrr Movie Motion Poster Talk, Ntr, Olivia Morris, Ram Charan, Rrr Movie Motion Poster, Ss Rajamouli

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.

TeluguStop.com - Director Rajamouli Rrr Movie Motion Poster Talk

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

TeluguStop.com - ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ మాములుగా లేదుగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ రోజు ఉగాది పండుగ కానుకగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

అయితే దాదాపుగా ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి అందరూ ఆర్.ఆర్.ఆర్ అంటే ఏమిటో తెలియక సందిగ్ధంలో పడిపోయారు.కానీ ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసినటువంటి ఈ మోషన్ పోస్టర్ లో ఈ చిత్ర టైటిల్ పై స్పష్టత ఇచ్చారు.ఇందులో మొదటి ఆర్ అంటే రౌద్రం అని, రెండవ ఆర్ అంటే రణం అని, మూడవ ఆర్ అంటే రుధిరం అని తెలిపారు.

అంతేగాక ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన టువంటి పాత్రలపై కూడా స్పష్టత ఇచ్చారు.అయితే ఇందులో అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడిన టువంటి అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తుండగా, అలాగే తెలంగాణ సాయుధ బలగాల్లో పోరాటం చేసినటువంటి కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలిపారు.

అంతేగాక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి నెలలో 8వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.మొత్తానికి ఇన్ని రోజులకి ఆర్.ఆర్.ఆర్ అనే చిత్ర టైటిల్ పై నెలకొన్నటువంటి సందిగ్ధతపై స్పష్టత వచ్చింది.దీంతో ఇటు మెగా అభిమానులు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన కొద్ది సమయంలోనే 4లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి.

#Alia Bhatt #Ajay Devgn #Ram Charan #RRRMovie #Olivia Morris

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Rajamouli Rrr Movie Motion Poster Talk Related Telugu News,Photos/Pics,Images..