టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి బాహుబలి 2 వరకు సినిమాసినిమాకు తన గ్రాఫ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న దర్శకుడు రాజమౌళి.సినీ ప్రేక్షకులు ప్రేమగా జక్కన్న అని పిలుచుకునే రాజమౌళి పుట్టినరోజు నేడు.19 సంవత్సరాల సినీ కెరీర్ లో తక్కువ సంఖ్యలోనే సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని సైతం అమాంతం పెంచుతున్నాడు.
అయితే గత కొన్ని నెలలుగా రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాకు పరిమితం కావడంతో ఇతర స్టార్ డైరెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజమౌళి ఎంట్రీతో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా వాయిదా పడింది.
ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ తెలీదు.మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించాల్సి ఉంది.
అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం త్రివిక్రమ్ ను గందరగోళంలోకి నెట్టేస్తుంది.ఇదే సమయంలో మహేష్ త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమని ప్రకటించాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయాలా.? లేక ఎన్టీఆర్ కోసం ఎదురు చూడాలా.? అనే సందిగ్ధంలో ఉన్నారు.ఏడాదికి ఒకటి లేదా సినిమాలు చేసే రామ్ చరణ్, ఎన్టీఆర్ మూడేళ్లు ఒకే ప్రాజెక్టుకు పరిమితం కావడంతో స్టార్ హీరోల కోసం ఎదురు చూస్తూ కొందరు డైరెక్టర్లు ఖాళీగా ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను బట్టి తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్లాన్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నా రాజమౌళి రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేమంటూ చేసిన ప్రకటన టాలీవుడ్ దర్శకనిర్మాతలను టెన్షన్ పెడుతుండటం గమనార్హం
.