ఆ హాలీవుడ్ చిత్ర స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్! రాజమౌళి మరోసారి అదే పంథాలో  

Director Rajamouli Making Rrr Movie In Hollywood Style-alia Bhatt,director Rajamouli,jr Ntr,ram Charan,rrr Movie,rrr Movie Release Date,rrr Movie Shooting Updates

నందమూరి హీరో తారక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టిన రాజమౌళి దీనిని అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రల స్ఫూర్తితో తయారుచేసుకున్న ఫిక్షన్ స్టోరీ అని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నాడు..

ఆ హాలీవుడ్ చిత్ర స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్! రాజమౌళి మరోసారి అదే పంథాలో-Director Rajamouli Making RRR Movie In Hollywood Style

ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో నార్త్ ఇండియాలో లో భారీ షెడ్యూల్ కి రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాడు అనే వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాకి మోటార్ సైకిల్ డైరీ అనే సినిమా స్ఫూర్తి అని తెలుస్తుంది. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన చాలా చిత్రాలు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే.

రాజమౌళి సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా అందులో చాలావరకు సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేసిన అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే పంథాలో రాజమౌళి తెరకెక్కించిన గమనార్హం. ఇప్పటికే బాహుబలి తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ఈ సినిమాతో మరి ఏ స్థాయిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.