నిద్రలేని రాత్రులు గడుపుతున్న జక్కన్న.. కారణమేంటంటే..?- Director Rajamouli Having Restless Nights

director rajamouli having restless nights, director rajamouli , rrr movie, ram charan, ntr, rrr movie shooting, hardwork, rrr team, komaram bheem, alluri seetha ramaraju - Telugu Alluri Seetha Ramaraju, Director Rajamouli, Director Rajamouli Having Restless Nights, Hardwork, Jr Ntr, Komaram Bheem, Ntr, Rajamouli, Ram Charan, Restless Life, Rrr Movie, Rrr Movie Shooting, Rrr Team

స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి బాహుబలి 2 సినిమా వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాసినిమాకు బడ్జెట్ పెరుగుతుండగా అదే స్థాయిలో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి.

 Director Rajamouli Having Restless Nights-TeluguStop.com

ప్రస్తుతం రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ నెల 8వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదలై ఉండేది.

 Director Rajamouli Having Restless Nights-నిద్రలేని రాత్రులు గడుపుతున్న జక్కన్న.. కారణమేంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కరోనా నిబంధనల వల్ల, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.అయితే ఆర్ఆర్ఆర్ విడుదల ఆలస్యమవుతున్నా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో రాజమౌళిపై కూడా గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది.

అయితే రాజమౌళి గత కొన్ని రోజుల నుంచి నిద్రను కూడా పక్కనపెట్టి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం శ్రమిస్తున్నారని సమాచారం.విదేశీయులు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూ ఉండటంతో ఒకటికి పదిసార్లు సీన్ ను చెక్ చేసుకుంటున్నారని.ఒక వైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు విజువల్ ఎఫెక్ట్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి రెండు టీజర్లు విడుదల కాగా రెండు టీజర్లకు భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ వచ్చాయి.

#Jr NTR #Restless Life #Rajamouli #Hardwork #AlluriSeetha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు