కే విశ్వనాథ్ మృతిపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన జక్కన్న.. పోస్ట్ వైరల్!

Director Rajamouli Emotional Post On Kalatapaswi K Vishwanath Demise Details, SS Rajamouli, K Viswanath, Tollywood, Rajamouli Emotional Post ,kalatapaswi K Vishwanath, K Vishwanath Demise, K Vishwanath Rajamouli

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు జరుగుతున్నాయి.గత ఆరు నెలల్లోనే ఎంతో మంది ప్రముఖుల మరణ వార్త మన టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో నెట్టింది.

 Director Rajamouli Emotional Post On Kalatapaswi K Vishwanath Demise Details, S-TeluguStop.com

ఒకరి తర్వాత మరొకరు మరణిస్తూ ఇండస్ట్రీలో తీరని లోటు మిగుల్చు తున్నారు.ఈ మధ్య చాలా మంది లెజెండరీ నటీ నటులను మన తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది.

ఇక తాజాగా మరొక దిగ్గజ నటుడిని కోల్పోయింది.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అగ్ర డైరెక్టర్ గా ఎన్నో దశాబ్దాల పాటు కొనసాగిన కళా తపస్వి కే విశ్వనాథ్ కొద్దీ గంటల ముందు మరణించారు.

ఈ ఉదయాన్నే ఈయన మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు విచారం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

ఇక ఇండస్ట్రీలో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ కే విశ్వనాథ్ గారి మరణ వార్తపై తమ సంతాపం తెలుపు తున్నారు.ఈయన ఇండస్ట్రీలో చేసిన సినిమాలు, అందుకున్న అవార్డులు, రివార్డు గురించి మాట్లాడు కుంటున్నారు.మరి ఈయన మరణ వార్త విన్న టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ రాజమౌళి కూడా పోస్ట్ చేసారు.

రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.”ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K.విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం.

తెలుగు సినిమాలో మీ ఆర్ట్ ఎప్పటికి బ్రైట్ గా నిలిచి పోతుంది అని.సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాము సర్” అంటూ రాజమౌళి కొద్దిగా ఎమోషనల్ గా పోస్ట్ చేసారు.ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube