అజిత్.తమిళ సూపర్ హీరో .అక్కడి జనాలు తనను ఎంతగానో అభిమానిస్తారు.అజిత్ లాంటి వ్యక్తి హై పొజిషన్ లో ఉన్నా.
తను మాత్రం చాలా సాధారణంగా ఉంటాడు.తోటి జనాలతోనూ చాలా మామూలుగా వ్యవహరిస్తాడు.
తాజాగా అజిత్ కు సంబంధించిన పలు విషయాల గురించి దర్శకుడు రాజమౌళి చెప్పాడు.ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.
ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ తను ఏం చెప్పిండో ఇప్పుడు తెలుసుకుందాం.
కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ అజిత్ చాలా సింపుల్ గా ఉంటాడని చెప్పాడు రాజమౌళి.అజిత్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నాడు.అజిత్ తో తనకు జరిగిన ఓ సంఘటనను వెల్లడించాడు.రాజమౌళి కుటుంబం సితార హోటల్ కి వెళ్ళింది.రాజమౌళి ఫోన్ లో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లాడు.అక్కడ ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అజిత్.
తన భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు.ఆ సమయంలో అజిత్ రాజమౌళిని చూశాడు.
దగ్గరికి వెళ్లి.ఎలా ఉన్నారు సర్ అంటూ పలకరించాడు.అంతేకాదు.రాజమౌళిని తన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు అజిత్.ఆ సమయంలో వాళ్లిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.అంతలోనే రమా రాజమౌళి అక్కడికి వచ్చింది.
వాస్తవానికి అజిత్ అప్పటికే మంచి హీరోగా గుర్తింపు పొందాడు.మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అయినా కూడా ఎంతో వినయంగా వెళ్లి అజిత్.రాజమౌళిని పరిచయం చేసుకున్నాడు.ఓ పెద్ద హీరో.అతి సామాన్య వ్యక్తిలా వ్యవహరించడం తనకు చాలా నచ్చిందని చెప్పాడు.
ఆయనతో ఆ రోజు గడిపిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు రాజమౌళి.ప్రస్తుతం తను మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.
నిజానికి అజిత్ కు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అద్భుతమైన సినిమాల్లో నటించి పెద్ద హీరోగా మారినా.
తన ప్రవర్తన చాలా సింపుల్ గా ఉండటం విశేషం.