‘వాంటెడ్ పండు గాడ్’ సినిమా జూన్ నెలాఖరు లేదా జూలై తొలి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.ద‌ర్శ‌కేంద్రుడు కె.

 Director Raghavendra Rao Presents Wanted Pandugad Movie Release Date Details, Di-TeluguStop.com

రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’.‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.ఈ సందర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎంట‌ర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం.జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి క‌థ నాకు వినిపించారు.హిలేరియ‌స్‌గా అనిపించింది.నిజానికి త‌నికెళ్ల భ‌ర‌ణి గారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామ‌ని అనుకున్నారు.పెళ్లి సంద‌D సినిమాకు శ్రీధ‌ర్ సీపాన అద్భుత‌మైన డైలాగ్స్‌ను అందించాడు.

దాంతో త‌నే వాంటెడ్ పండుగాడ్ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌నిపించింది.పి.ఆర్ సంగీతం, మ‌హి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తుంది.ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

వీళ్లంద‌రితో క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల నాకు వ‌య‌సు గుర్తుకు రాదు.ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు.

అంద‌రికీ థాంక్స్‌.జూన్ చివ‌రి వారం లేదా జూలై తొలి వారంలో ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

సునీల్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో పండు పాత్ర‌లో న‌టించాను.ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే సినిమా.ఫ్యామిలీ అంతా తెగ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

Telugu Anasuya, Deepika Pilli, Raghavendra Rao, Sridhar Sipana, Saptagiri, Sunee

రైట‌ర్ జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి మాట్లాడుతూ ‘‘ఈ పండు గాడ్ సినిమాకు వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే వంద సినిమాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం చేసిన డైరెక్ట‌ర్ రాసుకున్న సినిమాకు నేను రాసిన ప్రేమ‌లేఖ అనే పుస్త‌కం రాశారు.ఈ సినిమా కంటే దానికే ఎక్కువ‌గా వ‌ర్క్ చేశాను.అంద‌రూ ఆ పుస్త‌కాన్ని చ‌ద‌వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ సీపాన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ఏకైక దర్శకుడు రాఘవేంద్రరావుగారే. ఈ సినిమాకు నేను డైరెక్ష‌న్ నేర్చుకున్నాను.ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌లా వ‌ర్క్ చేశాను.నా కంటే రాఘ‌వేంద్ర‌రావుగారే ఎక్కువ టెన్ష‌న్ ప‌డ్డారు.

ఈ సినిమాకు క్రెడిట్ ఆయ‌న‌కే ద‌క్కుతుంది.నిర్మాత‌లు సాయి బాబ కోవెల‌మూడిగారికి, వెంక‌ట్ కోవెల మూడిగారికి థాంక్స్‌’’ అన్నారు.

Telugu Anasuya, Deepika Pilli, Raghavendra Rao, Sridhar Sipana, Saptagiri, Sunee

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో స‌ప్త‌గిరి, శ్రీనివాస రెడ్డి, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, ఆమ‌ని, దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.రాఘవేంద్ర‌రావు వంటి శ‌తాధిక లెజెండ్రీ డైరెక్ట‌ర్‌ సినిమాలో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని న‌టీన‌టులు తెలిపారు.

నటీనటులు:

సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ : కె.రాఘ‌వేంద్ర‌రావు, బ్యాన‌ర్ : యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత‌లు : సాయి బాబ కోవెల‌మూడి, వెంక‌ట్ కోవెల మూడి, ద‌ర్శ‌క‌త్వం : శ్రీధ‌ర్ సీపాన‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే : జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి, సినిమాటోగ్ర‌ఫీ : మ‌హి రెడ్డి పండుగుల‌, మ్యూజిక్ : పి.ఆర్‌, ఎడిట‌ర్ : త‌మ్మిరాజు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube