గోవాలో ప్రారంభ‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాధ్‌, క‌ర‌ణ్ జోహార్‌, ఛార్మీ కౌర్ పాన్ ఇండియా ఫిలిం 'లైగ‌ర్' కొత్త షెడ్యూల్

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్‘.విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్‌‘ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

 Director Puri Jagannath Vijay Devarakonda Movie Liger Final Schedule Started In Goa-TeluguStop.com

ఈ రోజు (బుధవారం) గోవాలో లైగర్‌ నెక్ట్స్‌ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ఈ షెడ్యూల్ లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

బ్లడ్.స్వెట్… వైలెన్స్ #లైగ‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు.ఈ సంద‌ర్భంగా లైగర్ షూటింగ్ లొకేష‌న్ నుండి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు నిర్మాత‌ ఛార్మి.ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ MMA ఫైటర్‌గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

 Director Puri Jagannath Vijay Devarakonda Movie Liger Final Schedule Started In Goa-గోవాలో ప్రారంభ‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాధ్‌, క‌ర‌ణ్ జోహార్‌, ఛార్మీ కౌర్ పాన్ ఇండియా ఫిలిం లైగ‌ర్’ కొత్త షెడ్యూల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లో ఫారెన్ ఫైటర్స్ కూడా భాగం కాబోతున్నారు.

స్పోర్ట్స్ యాక్షన్ థిల్లర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా న్యూ లుక్ లోకి మారారు.

మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని సినిమా కోసం నాచురల్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

Telugu Ananya Panday, Cahrmi Karu, Director Puri Jagannath, Final Schedule Started In Goa, Karan Johar, Liger, Liger Movie New Poster, Pan India Movie, Saala Cross Breed, Sports Backdrop Movie, Tollywood, Vijay Devarakonda-Movie

బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్ లో బడ్జెట్ లో ఎక్కడా కాంప్ర‌మైజ్‌ కాకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు.విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా…థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచా ఈ సినిమాకు వర్క్ చేస్తుండటం విశేషం.పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో రూపొందుతున్న ఈ సినిమాలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Telugu Ananya Panday, Cahrmi Karu, Director Puri Jagannath, Final Schedule Started In Goa, Karan Johar, Liger, Liger Movie New Poster, Pan India Movie, Saala Cross Breed, Sports Backdrop Movie, Tollywood, Vijay Devarakonda-Movie

నటీనటులు:

విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్‌ దేశ్‌ పాండే, గెటప్‌ శీను

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శక‌త్వం: పూరి జ‌గ‌న్నాధ్‌ నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాధ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా బేన‌ర్స్‌: పూరి క‌నెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌ డీఓపీ: విష్ణు శర్మ ఆర్ట్‌ డైరెక్టర్‌: జానీ షేక్‌ భాష ఎడిటర్‌: జూనైద్‌ సిద్ధిఖీ స్టంట్‌ డైరెక్టర్‌: కెచ

.

#Saala Breed #Liger Poster #Cahrmi Karu #Liger #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు