జీవితానికి అదే ముఖ్యం అంటున్న పూరీ జగన్నాథ్!

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పూరీజగన్నాథ్ గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 Director Puri Jagannath Valuable Words About Life, Director Puri Jagannath, Emot-TeluguStop.com

లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా త్వరలో మళ్లీ షూటింగ్ మొదలుకానుంది.లాక్ డౌన్ సమయంలో పూరీ మ్యూజింగ్స్ ద్వారా పూరీ జగన్నాథ్ అనేక విషయాల గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను చెబుతున్నారు.

తాజాగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడిన పూరీ జగన్నాథ్ మనలో చాలా మందికి ఐక్యూ ఉంటుందని ఐక్యూ ఉన్నా ఈక్యూ ఉండదని అన్నారు.ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ అని తెలిపారు.

ఎవరిలోనైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్లు ఉన్నత స్థానాలకు లీడర్లుగా ఎదగగలరని తెలిపారు.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మొత్తం నాలుగు రకాలు ఉంటాయని వెల్లడించారు.

Telugu Puri Jagannath, Puri-Movie

వాటిలో సెల్ఫ్ అవేర్ నెస్, సెల్ఫ్ మేనేజ్ మెంట్, సోషల్ అవేర్ నెస్, రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ ఉంటాయని అన్నారు.మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో గుర్తుంచుకోవాలని.ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటున్నామనే దానిని బట్టే ఇతరులు మనపై ఒక అంచనాకు వస్తారని తెలిపారు.ఇతరులు ఏం చెప్పినా తప్పకుండా వినాలని.

ఏదైనా తప్పు జరిగితే ఆ బాధ్యతను మీరే తీసుకోవాలని సూచించారు.

ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని చెప్పారు.

మైండ్ ఎల్లప్పుడూ బ్యాలన్స్ గా ఉంచుకోవాలని.అలా ఉంచుకుంటే మాత్రమే ఇతరులు నమ్ముతారని వెల్లడించారు.

మనల్ని మనం మొదట పూర్తిగా అర్థం చేసుకుంటే మాత్రమే ఇతరులకు సలహాలు ఇవ్వడం సాధ్యమవుతుందని.మన జీవితానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యమని చెబుతున్నారు.

పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చాలామంది ఆ మాటలు నిజమేనని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube