అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు కొడుకు.. హీరోగా నిలబెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్న పూరీ

Director Puri Jagannath Struggles For Family

పూరీ జగన్నాథ్. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్.

 Director Puri Jagannath Struggles For Family-TeluguStop.com

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశాడు.అందులో పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి.

అయితే ఎంతో మందిని టాప్ హీరోలుగా మలిచిన పూరీ జగన్నాథ్.తన ఫ్యామిలీ మెంబర్స్ ను మాత్రం మంచి హీరోలుగా తీర్చిదిద్దలేకపోడుతున్నాడు.

 Director Puri Jagannath Struggles For Family-అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు కొడుకు.. హీరోగా నిలబెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్న పూరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టేందుకు ఆ హీరోను, ఈ హీరోను పట్టుకుని ప్రమోషన్స్ చేయిస్తున్నాడు.తాజాగా తన కొడుకు సినిమాకు హైప్ తెచ్చేందుకు ఏకంగా పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ ను బరిలోకి దింపాడు.

నిజానికి పూరీ జగన్నాథ్ హిట్స్, ఫట్స్ అని పెద్దగా పట్టించుకోడు.వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.అయితే తన ఫ్యామిలీ నుంచి ఓ హీరో ఉండాలని అని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు.అందులో భాగంగానే తన కొడుకు మంచి హీరోగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అయితే ఈయన అనుకున్నంత ఈజీగా ఆ పని జరగట్లేదు.అందుకే తన తనయుడు తాజాగా హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ అనే సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజిలో చేస్తున్నాడు.

తొలుత పూరీ ఫ్యామిలీ నుంచి తన తమ్ముడు సాయి శంకర్ ను హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.తనే స్వయంగా దర్శకత్వం వహించి పలు సినిమాలు తీశాడు.

కానీ తను అనుకున్నంత స్థాయిలో నిలబడలేదు.ఇప్పుడు తన కొడుకును హీరోగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే తను పలు సినిమాలు చేసినా.అంతగా సక్సెస్ కాలేదు.

Telugu Director Puri Jagannath, Hero Akash Puri, Hero Prabhas, Heroine Kethika, Prui Brother, Puri, Romantic Movie, Sai Shankar, Son Akash Puri, Struggles For Family, Vijay Devarakonda-Movie

తాజాగా ఆకాష్, కేతిక జంటగా అనిల్ దర్శకత్వంలో రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కింది.అక్టోబర్ 29న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.ఈ సినిమాతోనైనా ఆకాష్ తన సత్తా చాటుకునేలా ప్రయత్నిస్తున్నాడు పూరీ.అందుకే ప్రభాస్ సహా పలువురు హీరోలతో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయిస్తున్నాడు.అటు ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యాడు.మొత్తానికి పూరీ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

#Prui Brother #Kethika #Prabhas #Akash Puri #Akash Puri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube