తెలివైన వాళ్లే ఆత్మహత్య చేసుకుంటారంటున్న పూరీ జగన్నాథ్..!  

director puri jagannadh sensational comments about suicide, director puri jagannadh, suicide,Intelligent People, Brave, Problems in life - Telugu Brave, Director Puri Jagannadh, Director Puri Jagannadh Sensational Comments About Suicide, Fighter Movie Director, Intelligent People, Problems In Life, Puri Musings, Suicide

దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా ఒక్క డైలాగ్ తోనే ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు.లాక్ డౌన్ వల్ల ఖాళీ సమయం దొరకడంతో వివిధ అంశాల గురించి స్పందిస్తున్న పూరీ జగన్నాథ్ తాజాగా ఆత్మహత్య గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - Director Puri Jagannath Sensational Comments About Suicide

తెలివైన వాళ్లే ఆత్మహత్య చేసుకుంటారని పూరీ అన్నారు.ఆత్మహత్య చేసుకునే దమ్ము కొద్ది మందికి మాత్రమే ఉంటుందని అన్నారు.

ఎవరైతే ఎక్కువగా బాధ్యతలను మోస్తూ ఉంటారో వారికే అలాంటి ఆలోచనలు వస్తాయని వ్యాఖ్యానించారు.జీవితంలో ఎన్నోసార్లు మనపై మనకే చిరాకు, అసహ్యం కలుగుతాయని.అలాంటి సమయంలోనే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుందని.తెలివైన వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి వాళ్లంటే తనకు ఎంతో రెస్పెక్ట్ అని అన్నారు.

TeluguStop.com - తెలివైన వాళ్లే ఆత్మహత్య చేసుకుంటారంటున్న పూరీ జగన్నాథ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చనిపోయే ధైర్యం ఉన్నవాళ్లు హీరోలని.కానీ హీరోలు ఎప్పుడూ చనిపోరని వ్యాఖ్యానించారు.

చాలామంది పిరికివాళ్లు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారని అనుకుంటారని.పిరికివాళ్లకు అలాంటి ఆలోచనలు అస్సలు రావని పూరీ అన్నారు.ఎవరైనా ఫైనాన్షియల్, ఫ్యామిలీ, ఇతర సమస్యలు ఉంటే మాత్రమే చనిపోవాలని అనుకుంటారని.ఎటువంటి బాధ్యతలు తీసుకోని వాళ్లకు ఇలాంటి ఆలోచనలు అస్సలు రావని అన్నారు.

లైఫ్ లో కొన్ని సమస్యలే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు కారణమవుతాయని.కొందరికి మాత్రమే ప్రాణాలు తీసుకునే దమ్ము ఉంటుందని అన్నారు.

ఎలాంటి బాధ్యతలు లేకుండా జీవించే వాళ్లకు ఆత్మహత్య ఆలోచన రాదని కానీ నిజానికి వాళ్లే త్వరగా చనిపోవాలని చెప్పారు.ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నవాళ్లు, ఒకరు మాటంటే పడని వాళ్లు, తెలివైన వాళ్లు చనిపోవాలని అనుకుంటారని.

అవన్నీ హీరో లక్షణాలని.అలాంటి వాళ్లు చనిపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

పూరీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#DirectorPuri #DirectorPuri #Puri Musings #FighterMovie #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Puri Jagannath Sensational Comments About Suicide Related Telugu News,Photos/Pics,Images..