పొట్టపై పూరీ జగన్నాథ్ హాట్ కామెంట్స్.. అసలు ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి, ఆయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Director Puri Jagannath Hot Comments On The Stomach What Did He Actually Say-TeluguStop.com

స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా పొట్టపై కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు పూరి జగన్నాథ్.

 Director Puri Jagannath Hot Comments On The Stomach What Did He Actually Say-పొట్టపై పూరీ జగన్నాథ్ హాట్ కామెంట్స్.. అసలు ఏం చెప్పారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని రోజుల నుండి పూరి జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్‘ పేరుమీద కొన్ని విషయాలు పంచుకుంటున్నాడు.

ఇక తాజా ‘గట్‘ అనే పేరుతో ఓ వీడియోను పంచుకోగా అందులో పొట్ట గురించి దానిని ఎలా చూసుకోవాలో తెలిపాడు.గట్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్ అని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు.

కొన్ని సమయాలలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు తిండి లేక ఒక ముసలమ్మ కనిపిస్తుందని.ఆ పరిస్థితి చూడగానే కడుపులో దేవేసినట్టు ఉంటుందని తెలిపాడు.

రౌడీ అతి దారుణంగా ఒక అమాయకుడిని కొడుతున్నప్పుడు అప్పుడు కడుపు రగిలిపోతోంది అని తెలిపాడు.

అలా ఏదోక విషయంలో ఎందుకిలా చేశావని మనం ప్రశ్నించినప్పుడు కడుపు మండుతుందని అంటుంటారు.

Telugu Belly, Comments, Director, Gut Feeling, Hot Comments, Puri Jagannath, Puri Musings, Star Director, Stomach Second Brain, Tollywood-Movie

అంతేకానీ నా లివర్, లంగ్స్ మండిందని ఎందుకు అనం అని ప్రశ్నించాడు.నిజానికి ప్రతి సారి కడుపు గుర్తుకు వస్తుందని.కడుపు మనకు సెకండ్ బ్రెయిన్ అని వెంటనే స్పందిస్తుందని మన బిల్లీ అని తెలిపాడు.మనం ఫీల్ అయ్యే ప్రతి విషయంలో లార్జ్ ఇంటేస్టయిన్స్ రియాక్ట్ అవుతుందని.

ఆహారాన్ని చూస్తే కడుపులో జ్యూస్లు విడుదలవుతాయని.అదే నమ్మిన మనిషి మోసం చేస్తే వాంతులవుతాయి అని తెలిపాడు.

ఎవరైనా ఒత్తిడికి గురైతే కడుపు ఇబ్బందిగా మారుతుందని, ఎవరి పైన కోపం చూపించిన కడుపులో ఎసిడిటీ మొదలవుతుందని.అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని తెలిపాడు.లేదంటే సెకండ్ మైండ్ పై ప్రభావం పడుతుందని.అందుకే ఎప్పుడు బలంగా ఉండాలని తెలిపాడు.

Telugu Belly, Comments, Director, Gut Feeling, Hot Comments, Puri Jagannath, Puri Musings, Star Director, Stomach Second Brain, Tollywood-Movie

ఏదైనా సందేహం లో ఉన్నప్పుడు.ఎవరైనా నీ గట్ ఫీలింగ్ ఏంటని ప్రశ్నించినప్పుడు.ఈసారి నా టార్గెట్ రీచ్ అయిపోతా అదే నా ఫీలింగ్ అని అంటుంటాం.అంటే ఆలోచన వచ్చిన వెంటనే అసలు నిర్ణయం చెప్పేస్తామని.అందుకు కడుపుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు.అంతేకాకుండా ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలని వాటి వల్ల రోగ నిరోధక శక్తి ఉంటుందని.

అంతేకాకుండా డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలని తెలిపాడు.ఇక పొట్టకి గ్యాప్ ఇవ్వాలని అప్పుడప్పుడు ఖాళీగా ఉంచాలని లేదంటే ఎఫెక్ట్ అవుతుందని తెలిపారు.

#Star Director #Puri Musings #Puri Jagannath #StomachSecond #Hot Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు