రామ్‌ సినిమా ఫలితంపై పూరి భవిష్యత్తు ఉందట!   Director Puri Jagannath Career Depends Upon Ram Movie     2018-10-17   10:05:32  IST  Ramesh P

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను దసరా కానుకగా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన కారణంగా సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం సక్సెస్‌ కావాలని చిత్ర యూనిట్‌ సభ్యులు కోరుకోవడం చాలా కామన్‌, కాని ఈ చిత్రం సక్సెస్‌ కోసం పూరి జగన్నాధ్‌ కూడా దేవుడిని మొక్కుకుంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రామ్‌ సినిమా కోసం పూరి ఎందుకు పూజలు చేస్తున్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారా. అసలు విషయం ఏంటీ అంటూ ‘మెహబూబా’ చిత్రం తర్వాత పదుల సంఖ్య హీరోలను కలిసి సినిమా చేసే ఛాన్స్‌ కోసం పూరి ప్రాదేయ పడ్డాడట. కాని పూరికి ఒక్క ఛాన్స్‌ కూడా దక్కలేదు. అయినా కూడా ప్రయత్నాలు మానేయకుండా రామ్‌ వద్దకు పూరి చేరుకున్నాడు. పూరితో చాలా కాలంగా సినిమా చేయాలనే కోరికతో ఉన్న రామ్‌ తాజాగా ఓకే చెప్పాడట. కాని హలో గురూ చిత్రం సక్సెస్‌ అయితేనే పూరితో సినిమాను చేయలను అంటూ రామ్‌ క్లారిటీగా చెప్పేశాడు.

Director Puri Jagannath Career Depends Upon Ram Movie-

‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం సక్సెస్‌ అయితే తప్ప రామ్‌ మరో సాహస నిర్ణయానికి సిద్దం అయ్యే పరిస్థితి లేదు. అందుకే పూరి హలో గురూ చిత్రం సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాడు. రామ్‌తో పూరికి సినిమా చేసే ఛాన్స్‌ వస్తే తప్పకుండా పూరి మరోసారి తన సత్తా చాటడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మరి పూరికి ఛాన్స్‌ వస్తుందో రాదో అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.