వైట్‌ హౌస్‌ భయంకర రహస్యాలు చెప్పిన పూరి  

అమెరికా అధ్యక్ష భవనం అంటే ప్రత్యేకంగా ఎవరికి పరిచయం అక్కర్లేదు.ప్రతి రోజు అంతర్జాతీయ వార్తల్లో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది.

TeluguStop.com - Director Puri Jaganadh Talks About American White House

అమెరికా అనగానే వైట్‌ హౌస్‌ గుర్తుకు వస్తుంది.అలాంటి ప్రపంప ప్రసిద్ది గాంచిన వైట్‌ హౌస్‌ ను ఒక దెయ్యాల కొంప అంటూ దర్శకుడు పూరి జగన్నాద్‌ తన మ్యూజింగ్స్‌ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

వైట్‌ హౌస్‌కు సంబంధించిన రహస్యలు అన్ని తెలుసు కనుక ట్రంప్‌ పూర్తిగా దూరంగా ఉన్నాడు అంటూ ఈ సందర్బంగా పూరి అన్నాడు.ఆయన కు తెలిసిన సమాచారం మొత్తం వెళ్లడిస్తూ సుదీర్ఘ వీడియోను షేర్‌ చేశాడు.

TeluguStop.com - వైట్‌ హౌస్‌ భయంకర రహస్యాలు చెప్పిన పూరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ వీడియోలో పూరి చాలా కీలక వ్యాఖ్యలు చేశాడు.అమెరికా గత చరిత్రను కూడా ఆయన లైట్‌గా చెబుతూ వైట్‌ హౌస్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు.

వైట్‌ హౌస్‌లో ఉంటే రాజబోగాలు అంటారు.కాని ప్రతి దానికి కూడా చార్జ్‌ చేస్తారు.అధ్యక్షుడికి వండి పెట్టే వంటమనిషికి వంట సామానుకు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా స్వయంగా ఆయనే చెల్లించాల్సి ఉంటుంది.ఆయనకు అందే జీతం నుండి వాటిని చెల్లించుకుంటూ మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం కేవలం వైట్‌ హౌస్‌ నిర్వాహణ చూసుకుంటుంది.కనీసం అధ్యక్షుడిగా ఎన్నిక అయిన వారి సామానును పాత ఇంటి నుండి వైట్‌ హౌస్‌ కు తరలించేందుకు కూడా సోంత వెయికిల్‌ లేదా సొంతంగా రవాణ ఖర్చు ఇచ్చి మార్పించుకోవాలని పూరి అన్నాడు.

ఇక పలువురు అధ్యక్షులు మరియు ఆయన భార్యలు వైట్‌ హౌస్‌లో మృతి చెందారు.కనుక వారి ఆత్మలు ఖచ్చితంగా వైట్‌ హౌస్‌లో ఉంటాయి అంటూ చాలా మంది అంటూ ఉంటారు.

గతంలో ఒక అమెరికన్‌ అధ్యక్షుడు వైట్‌ హౌస్‌ లో ఒంటరిగా ఉన్న సమయంలో భయంకరమైన శబ్దాలు రావడంతో పాటు ప్రెసిడెంట్‌ సర్‌ అంటూ పిలిచినట్లుగా అనిపించిందని అన్నాడు.ఇంకా పలు ఆసక్తికర విషయాలను పూరి చెప్పుకొచ్చాడు.

#Puri Director #White House #America #Puri Jaganadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు