చిరంజీవి విషయంలో ఆ దర్శకుని జోస్యం నిజమైందా..?

సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.అయితే చిరంజీవి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు.

 Director Prophecy Came True In Chiranjeevi Matter, Came True,  Chiranjeevi Matte-TeluguStop.com

ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే చిరంజీవి నటుడిగా ఈ స్థాయికి ఎదుగుతాడని ఒక దర్శకుడు మాత్రం ముందుగానే జోస్యం చెప్పారు.

ఆ దర్శకుని జోస్యం నిజం కావడంతో పాటు చిరంజీవి స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

చిరంజీవి, మోహన్ బాబు కలిసి బిల్లా రంగా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.కే.ఎస్.ఆర్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Telugu True, Phophecy, Ksr Doss-Movie

కే.ఎస్.ఆర్.దాస్ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ లా చిరంజీవి కూడా పాపులారిటీ సంపాదించుకుంటారని చెప్పగా ఆయన మాటలే నిజమయ్యాయి.ఒకసారి దర్శకుడు చిరంజీవి వీపుపై ఉన్న పెద్ద పుట్టుమచ్చను గమనించారు.సీనియర్ ఎన్టీఆర్ కు కూడా అదే విధంగా మచ్చ ఉండటంతో కే.ఎస్.ఆర్ దాస్ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉంటుందని మెగాస్టార్ తో అన్నారు.

మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైన తరువాతే కొత్త సినిమాలను మొదలుపెట్టాలని భావిస్తున్నారు.రీఎంట్రిలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

లూసిఫర్ రీమేక్ తో పాటు వేదాళం రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నారు.లూసిఫర్ రీమేక్ కు డైరెక్టర్ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.

మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube