బాలయ్యకి ఎర వేస్తున్న కల్కీ కుర్ర దర్శకుడు  

బాలయ్యతో సినిమా చేస్తా అంటున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. .

Director Prashanth Varma Interested Direct Nandamuri Balakrishna-

ఆ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.మొదటి సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయియన ఈ యువ దర్శకుడు తన మేకింగ్ స్టైల్ లో టాలీవుడ్ లో అందరి ద్రుష్టిని ఆకర్షించాడు.

Director Prashanth Varma Interested Direct Nandamuri Balakrishna--Director Prashanth Varma Interested Direct Nandamuri Balakrishna-

దీంతో రెండో సినిమా ఏకంగా రాజశేఖర్ లాంటి స్టార్ హీరోతో చేసే అవకాశం వచ్చింది.కల్కీ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటుంది.

అప్పుడే రాజశేఖర్ ఖాతాలో మరో హిట్ ఖాయం అంటే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం కల్కీ సినిమా ప్రమోషన్ మీద ద్రుష్టి పెట్టాడు.ఇందులో భాగంగా ఆసక్తికరమైన వాఖ్యలు చేసాడు.అవకాశం ఉంటే తన నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో చేస్తానని చెబుతున్న ప్రశాంత్ వర్మ బాలయ్యలో ఉన్న నటుడుకి కరెక్ట్ గా సరిపోయే కథ తన దగ్గర ఉందని చెబుతున్నాడు.

ఇప్పటి వరకు రొటీన్ మూస సినిమాలు చేస్తున్న బాలయ్య తనకి అవకాశం ఇస్తే బాలకృష్ణ ఫాన్స్ ఇప్పటి వరకు చూడని విధంగా సరికొత్త బాలకృష్ణని ఆవిష్కరిస్తా అని చెబుతున్నాడు.ఈ ప్రశాంత్ వర్మ టాలెంట్ తెలిసిన బాలయ్య ఫాన్స్ అతనికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు కోరుకుంటున్నారు.