ప్రభాస్ అమాయకుడు అంటున్న స్టార్ డైరెక్టర్..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 ఘనవిజయాల తరువాత వరుస సినిమాలకు కమిటవుతూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఒక సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాకు కూడా ఓకే చెప్పారు.2021 జనవరి నుంచి సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
సలార్ మూవీ గురించి అనేక గాసిప్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Director Prashant Neel Interesting Comments About Prabhas, Director Prashant Nee-TeluguStop.com

సలార్ అనే టైటిల్ గురించి చాలామంది అడుగుతున్నారని ఆ పదం ఉర్దూ భాషకు చెందిన పదం అని ప్రశాంత్ తెలిపారు.సలార్ అంటే సమర్థవంతమైన నాయకుడు అనే అర్థం వస్తుందని చెప్పారు.

ఆ పదం చాలా సామన్య పదం అని అన్నారు.

Telugu Aadipurush, Prashant Neel, Prabhas, Salar-Movie

సినిమాలో ప్రభాస్ పాత్ర రాజుకు కుడి భుజంలా ఉంటూ ప్రజల కోసం పాటు పడేలా ఉంటుందని అన్నారు.ప్రభాస్ చాలా అమాయకుడని.ఆయనలోని అమాయకత్వాన్ని బయటపెట్టేందుకు ఈ సినిమా తీస్తున్నానని ప్రశాంత్ తెలిపారు.

ప్రభాస్ ఈ సినిమాలో చాల వైలెంట్ గా కనిపిస్తాడని ప్రశాంత్ తెలిపారు.ప్రభాస్ ను హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణమేంటని చాలామంది అడుగుతున్నారని ఈ సినిమాలోని పాత్రకు ప్రభాస్ చక్కగా సరిపోతాడని అందుకే ప్రభాస్ ను ఎంపిక చేసుకున్నానని ప్రశాంత్ అన్నారు.

ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా తరువాత ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.ప్రభాస్ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube