రాజశేఖర్‌ చాలా మంచోడు, వేలు పెట్టకుండా పూర్తి స్వేచ్చ ఇచ్చాడన్న దర్శకుడు... నమ్మకం కుదరట్లేదంటున్నారు

రాజశేఖర్‌ హీరోగా ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే చిత్రం రూపొందుతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి.భారీ అంచనాల నడుమ, భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.1980 నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.అంటే రంగస్థలం చిత్రానికి కాస్త అటు ఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.అద్బుతమైన కథాంశంతో ఈ చిత్రంను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్నాడట.

 Director Prasanth Varma Says Hero Rajasekhar Is A Good Person-TeluguStop.com

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ పదే పదే ఇన్వాల్స్‌ అవుతున్నాడని, ప్రతి విషయంలో కూడా తనదైన ముద్ర వేసేలా ప్రయత్నాలు చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.రాజశేఖర్‌ దర్శకత్వంలో ఇన్వాల్స్‌ అవుతుండటంతో దర్శకుడు పూర్తి స్వేచ్చగా సినిమాను రూపొందించలేక పోతున్నాడట.ఆ కారణం వల్ల ఇద్దరి మద్య విభేదాలు వచ్చాయని, దర్శకుడిని తొలగించి మరో దర్శకుడితో సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు.

రాజశేఖర్‌ తనకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడని, ఆయన స్వేచ్చతో నేను అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆయన కెమెరా ముందుకు వెళ్తే సర్‌ రెడీ అంటూ పాత్రలో ఇన్వాల్వ్‌ అవుతాడని, నేను ఏది చెప్తే అది చేస్తాడని ప్రశాంత్‌ వర్మ అన్నాడు.ఇప్పటి వరకు రాజశేఖర్‌ వంటి హీరోను తాను చూడలేదని, ఆయనతో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని, చాలా స్వీట్‌ పర్సన్‌ అంటూ నిచ్చన ఎక్కిస్తున్నాడు.రాజశేఖర్‌కు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మంచి వాడు అనే సర్టిఫికెట్‌ ఇచ్చినప్పటికి కొందరు మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు.

వర్మ దర్శకత్వంలో రూపొందిన ఒక సినిమాలో రాజశేఖర్‌ ఇన్వాల్వ్‌ అయ్యాడనే ఆ సినిమాను ఆపేశాడు.అంతటి పేరున్న రాజశేఖర్‌ ‘కల్కి’ మేకింగ్‌లో ఇన్వాల్వ్‌ కావడం లేదంటే ఎవరు నమ్మరు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube