ఆ సీక్వెల్ కోసం అంతా రెడీ... నిర్మాత బ్యాలెన్స్  

Director Prasanth Varma Open Up Awe Sequel Script-director Prasanth Varma Open Up,kalki Movie,tollywood

ఆ సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టాలెంట్ ప్రశాంత్ వర్మ.మొదటి సినిమాతోనే స్టార్ట్ కాస్టింగ్ ని హ్యాండిల్ చేయడంతో పాటు అద్బుతమైన స్క్రీన్ ప్లేతో ఒకే లొకేషన్ లో సినిమాని నడించిన ఆద్యంతం సినిమా టైటిల్ కి తగ్గట్లు ఆ అనిపిస్తాడు.

Director Prasanth Varma Open Up Awe Sequel Script-Director Kalki Movie Tollywood

అయితే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో నదించే ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాని నిర్మించాడు.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో కల్కీ అనే భారీ బడ్జెట్ మూవీని హ్యాండిల్ చేశాడు.ఆ సినిమా కూడా బాగుందనే టాక్ వచ్చిన బడ్జెట్ ఎక్కువగా పెట్టడం వలన నిర్మాతకి నష్టాలనే మిగిల్చింది.


ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ అఖిల్ తో సినిమా తీస్తాడని టాక్ వచ్చింది.అయితే అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా మొదలు పెట్టేసాడు.

ఇదిలా ఉంటే ఆ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అని సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మని ఫాన్స్ అడిగారు.దీనిపై అతను క్లారిటీ ఇచ్చేశాడు.ఆ సీక్వెల్ స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిపొయింది.మొదటి సినిమా కంటే ఇంటరెస్టింగ్ గా కథ సిద్ధమైంది.

అయితే ఈ సీక్వెల్ కోసం చాలా మంది నిర్మాతల దగ్గరకి వెళ్ళిన కూడా ఎవరు కనెక్ట్ కాలేకపోయారు.అందుకే దీనిని తెరపైకి ఎక్కించడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పాడు.

టేస్ట్ ఉన్న నిర్మాత దొరికితే ఆ సీక్వెల్ త్వరలో చూస్తారని చెప్పాడు.దీనిని బట్టి ఈ సీక్వెల్ పై నాని పెద్దగా ఆసక్తి చూపించలేదని టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

.

తాజా వార్తలు

Director Prasanth Varma Open Up Awe Sequel Script-director Prasanth Varma Open Up,kalki Movie,tollywood Related....