షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ చేసే పని ఇదే.. సీక్రెట్స్ చెప్పేసిన స్టార్ డైరెక్టర్!

స్టార్ హీరో ప్రభాస్ గురించి భారతీయ సినీ ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

 Director Om Raut Comments About Prabhas In Social Media-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కాగా మారారు.స్టార్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో కనీసం ఒక సినిమా అయినా చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తారు.

అయితే ప్రభాస్ లైఫ్ స్టైల్ గురించి మాత్రం అభిమానులకు ఎక్కువగా తెలియదు.ప్రభాస్ కూడా మీడియాకు దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ప్రభాస్ కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమని ఓం రౌత్ అన్నారు.

 Director Om Raut Comments About Prabhas In Social Media-షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ చేసే పని ఇదే.. సీక్రెట్స్ చెప్పేసిన స్టార్ డైరెక్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ కారవాన్ లో కూడా గాలి, వెలుతురు తగిలే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసుకున్నాడని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ కు పని చేసే సమయంలో కూడా ప్రకృతికి చేరువలో ఉండటం ఇష్టమని ఓం రౌత్ కామెంట్లు చేశారు.

Telugu Aadipurush Movie, Director Om Raut, Interesting Comments, Om Raut, Pan India Movie, Prabhas, Prabhas Caravan, Prabhas In Uk, Prabhas Loves Nature, Rajamouli, Social Media, Sun Roof-Movie

ప్రభాస్ కారవాన్ పై భాగంలో సన్ రూఫ్ ను ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం ప్రభాస్ యూకేలో ఉన్నారని బరువు తగ్గడానికి, లుక్ ను మార్చుకోవడానికి ప్రభాస్ ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతుండటంతో ప్రభాస్ కు రెస్ట్ దొరకడం లేదు.

Telugu Aadipurush Movie, Director Om Raut, Interesting Comments, Om Raut, Pan India Movie, Prabhas, Prabhas Caravan, Prabhas In Uk, Prabhas Loves Nature, Rajamouli, Social Media, Sun Roof-Movie

ప్రభాస్ ఒకే సమయంలో ఎక్కువ సినిమాల్లో నటించకూడదని కొంతమంది అభిమానులు ఈ హీరోకు సూచిస్తుండటం గమనార్హం.బాహుబలి, బాహుబలి2 తర్వాత పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని కథలు, దర్శకులను ప్రభాస్ ఎంపిక చేసుకుంటున్నారు.ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది.

#Pan India #Aadipurush #Prabhas Uk #Prabhas Caravan #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు