ఆ డైరెక్టర్ కు శ్రీహరి భార్య శాపనార్థాలు పెట్టేవారట.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ దర్శకులలో ఒకరైన ఎన్.శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరి గురించి, శ్రీహరి భార్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.శ్రీహరి నటించిన భద్రాచలం సినిమాలకు ఎన్.శంకర్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.భద్రాచలం షూటింగ్ సమయంలో శ్రీహరి భార్య శాంతి నా మొగుడిని చంపేస్తావా అని అన్నారని ఎన్.శంకర్ అన్నారు.శ్రీహరికి హలో బ్రదర్ తో పాటు పలు సినిమాల్లో ఛాన్స్ ఇప్పించానని ఎన్.శంకర్ చెప్పుకొచ్చారు.

 Director N Shankar Comments About Srihari And His Wife-TeluguStop.com

శ్రీహరి మోహన్ బాబులా యాక్షన్ చేస్తారని చెప్పడంతో హలో బ్రదర్ సినిమాలో అవకాశం వచ్చిందని ఎన్.శంకర్ అన్నారు.శ్రీహరి జెమ్ యాక్టర్ అని ఎన్.శంకర్ తెలిపారు.భద్రాచలం సినిమాలో రెండు కాళ్లు కట్టి వేలాడదీశామని అలాంటి రిస్కీ షాట్లు శ్రీహరి తప్ప ఎవరూ చేయలేరని ఎన్.శంకర్ చెప్పుకొచ్చారు.ఆ సాంగ్ కు నేను కొరియోగ్రాఫర్ కావడంతో శ్రీహరి మొండి వ్యక్తి కావడంతో బలవంతంగా అయినా చేసేవారని ఎన్.శంకర్ తెలిపారు.

Telugu Bhadrachalam Movie, Direcor N Shankar, Director N Shankar Interview, Disco Shanti, Interesting Facts, N Shankar, N Shankar In Nandi Awards Committee, Srihari Wife, Tollywood-Movie

శ్రీహరి భార్య సినిమా ఆడదని ఫిక్స్ అయ్యారని నా మొగుడిని నానా కష్టాలు పెడతారని శాపాలు పెట్టేవారని ఎన్.శంకర్ చెప్పుకొచ్చారు.శ్రీహరిని కొత్తగా చూపించాలని అనుకున్నానని అదే విధంగా చూపించానని ఎన్.శంకర్ తెలిపారు.ఆ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయని శంకర్ చెప్పుకొచ్చారు.కొన్నిసార్లు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని ఎన్.శంకర్ వెల్లడించారు.

 Director N Shankar Comments About Srihari And His Wife-ఆ డైరెక్టర్ కు శ్రీహరి భార్య శాపనార్థాలు పెట్టేవారట.. అసలేం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bhadrachalam Movie, Direcor N Shankar, Director N Shankar Interview, Disco Shanti, Interesting Facts, N Shankar, N Shankar In Nandi Awards Committee, Srihari Wife, Tollywood-Movie

అవార్డుల విషయంలో తనకు గాయాలు జరిగాయని ఎన్.శంకర్ అన్నారు.తాను ఆ తరువాత అవార్డుల జ్యూరీలో పని చేశానని తనకు జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని తాను భావించానని ఎన్.శంకర్ చెప్పుకొచ్చారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు కమిటీలో పని చేశానని ఎన్.శంకర్ వెల్లడించారు.ప్రతిభకు అన్యాయం జరగకూడదని తన ఉద్దేశమని ఎన్.శంకర్ అన్నారు.జై బోలో తెలంగాణకు అవార్డులు ఎక్కువగా వచ్చాయని శంకర్ చెప్పుకొచ్చారు.

#Srihari #Disco Shanti #Bhadrachalam #ShankarNandi #Direcor Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు