ఆ మూవీ బిజినెస్ ను దెబ్బకొట్టిన రాజశేఖర్ మాటలు.. ఏం జరిగిందంటే?

చాలా సందర్భాల్లో హీరోలు, హీరోయిన్లు చెప్పే మాటలు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చిరంజీవితో అన్నయ్య సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించిన తర్వాత ఒక మాట అనే సినిమాను ఉపేంద్ర హీరోగా తెరకెక్కించాల్సి వచ్చిందని తెలిపారు.

 Director Mutyala Subbayya Shocking Comments About Rajasekhar-TeluguStop.com

ఉపేంద్ర నటించడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందని రాజశేఖర్ నటించి ఉంటే ఆ సినిమా సక్సెస్ అయ్యేదని ముత్యాల సుబ్బయ్య అభిప్రాయపడ్డారు.

సినిమా అనేది కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసే బిజినెస్ అని వన్ సైడ్ నిర్ణయాలు సినిమా ఫలితాలపై ప్రభావం చూపుతాయని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.

 Director Mutyala Subbayya Shocking Comments About Rajasekhar-ఆ మూవీ బిజినెస్ ను దెబ్బకొట్టిన రాజశేఖర్ మాటలు.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉపేంద్ర మంచి నటుడే అయినా ఆ కథకు సరిపోయే నటుడు కాదని సినిమా ఫ్లాప్ కావడానికి టైటిల్ కూడా ఒక కారణమని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.సినిమా సక్సెస్ సాధిస్తే అందరికీ పేరు వస్తుందని ఫ్లాప్ అయితే మాత్రం ఆ పేరు దర్శకుని ఖాతాలోకి వెళుతుందని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

ఆ తర్వాత భగవాన్, దానయ్య నిర్మాతలుగా మలయాళంలో హిట్టైన సినిమా కథకు మార్పులు చేర్పులు చేసి మనసున్న మారాజు పేరుతో తెరకెక్కించామని దోసకాయలపల్లి అనే గ్రామంలో ఆ సినిమా షూటింగ్ పూర్తైందని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.అదే సమయంలో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో రాజశేఖర్ ఒక్కడు చాలు అనే సినిమాలో నటించారని తెలిపారు.

మనసున్న మారాజు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన తనను బాధ పెట్టిందని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

Telugu Manasunna Maaraaju Movie, Mutyala Subbayya, Rajasekhar, Shocking Comments-Movie

మనసున్న మారాజు సినిమాకు మొదట బయ్యర్లు భారీ మొత్తం అడ్వాన్స్ ఇచ్చారని అయితే రిలీజ్ డేట్ కు కొన్ని రోజుల ముందు సినిమా కొన్న రేట్లను తగ్గిస్తామని బయ్యర్లు చెప్పారని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.హీరో రాజశేఖర్ మనసున్న మారాజు కంటే ఒక్కడు చాలు బాగుందని చెప్పారని అందువల్లే హక్కులను తక్కువ మొత్తానికి అడుగుతున్నామని బయ్యర్లు చెప్పిన మాటలు విని తాను, నిర్మాత షాకయ్యామని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

#Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు