పవన్ రిజెక్ట్ చేసిన కథతో వడ్డే నవీన్ హిట్ కొట్టాడట.. ఏ సినిమా అంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకులలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథతో వడ్డే నవీన్ తో సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు.

 Director Mutyala Subbayya Comments About Vadde Naveen Movie-TeluguStop.com

బాలకృష్ణతో పవిత్ర ప్రేమ సినిమాను తెరకెక్కించి ఆ సినిమాతో సక్సెస్ అందుకున్న ముత్యాల సుబ్బయ్య శీనయ్య అనే వ్యక్తితో కలిసి కథలు వింటూ ఉండేవారు.

ముత్యాల సుబ్బయ్య, శీనయ్యకు ఒక కథ నచ్చగా పవన్ తో సినిమాను తెరకెక్కించాలని భావించారు.

 Director Mutyala Subbayya Comments About Vadde Naveen Movie-పవన్ రిజెక్ట్ చేసిన కథతో వడ్డే నవీన్ హిట్ కొట్టాడట.. ఏ సినిమా అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆ కథ నచ్చకపోవడంతో సున్నితంగా రిజెక్ట్ చేశారు.మరో కథ ఉంటే చెప్పాలని ముత్యాల సుబ్బయ్యకు పవన్ కళ్యాణ్ సూచించారు.

అయితే పవన్ రిజెక్ట్ చేయడం వల్ల శీనయ్య బాగా ఫీలయ్యారు.ఆ సమయానికి పెద్ద హీరోలు ఖాళీగా లేకపోవడంతో ముత్యాల సుబ్బయ్య అదే కథ చెప్పి వడ్డే నవీన్ ను ఒప్పించారు.

Telugu 2 Lakh 50 Thousand, Mutyala Subbayya, Pawan Rejectes Story, Rashi Sakshi Shivanand, Shenithulu Movie, Subbayya Comments, Tollywood, Vadde Naveen Movie-Movie

సాధారణంగా వడ్డే నవీన్ రెమ్యునరేషన్ 15 లక్షల రూపాయలు కాగా 20 లక్షలు తీసుకుంటున్నానని వడ్డే నవీన్ ముత్యాల సుబ్బయ్యకు చెప్పారు.చివరకు పదిహేడున్నర లక్షలకు రెమ్యునరేషన్ ను ఫైనలైజ్ చేసి ముత్యాల సుబ్బయ్య అడ్వాన్స్ ఇచ్చి వచ్చేశారు.స్నేహితులు అనే టైటిల్ తో రాశి, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఆ సినిమా సక్సెస్ సాధించింది.

Telugu 2 Lakh 50 Thousand, Mutyala Subbayya, Pawan Rejectes Story, Rashi Sakshi Shivanand, Shenithulu Movie, Subbayya Comments, Tollywood, Vadde Naveen Movie-Movie

ఆ సినిమాకు తాను 20 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నానని ముత్యాల సుబ్బయ్య అన్నారు.వడ్డే నవీన్ కు అదనంగా ఇచ్చిన 2.5 లక్షల రూపాయలను తగ్గించుకొని మిగిలిన మొత్తం ఇవ్వమని శీనయ్యకు చెప్పానని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.తనకు, శీనయ్యకు మధ్య డబ్బును మించిన అనుబంధం ఉందని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.

#Vadde Naveen #Shenithulu #RashiSakshi #PawanRejectes #Thousand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు