జీవిత, రాజశేఖర్ మధ్య అప్పటికే ప్రేమ.. దర్శకుడి కీలక వ్యాఖ్యలు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకుంటున్న దర్శకులలో ముత్యాల సుబ్బయ్య ఒకరు.ఒక సందర్భంలో ముత్యాల సుబ్బయ్య తాను తెరకెక్కించిన ఇన్ స్పెక్టర్ ప్రతాప్ సినిమాలో బాలకృష్ణ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారని ఈ సినిమా హిట్ గా నిలిచిందని తెలిపారు.

 Director Mutyala Subbayya Comments About Jeevitha Rajasekhar-TeluguStop.com

తాను డైరెక్షన్ చేసిన మొదటి మూడు సినిమాలలో రెండు సినిమాలు హిట్లుగా నిలిస్తే ఒక సినిమా యావరేజ్ రిజల్ట్ అందుకుందని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

ఆ తరువాత తనకు నిర్మాతల నుంచి ఆఫర్లు బాగా వచ్చినా ఆ క్రేజ్ ను ఏ విధంగా క్యాష్ చేసుకోవాలో తనకు అర్థమయ్యేది కాదని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

 Director Mutyala Subbayya Comments About Jeevitha Rajasekhar-జీవిత, రాజశేఖర్ మధ్య అప్పటికే ప్రేమ.. దర్శకుడి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకుమొహమాటం ఎక్కువ కావడంతో ఎంత రెమ్యునరేషన్ అడగాలో తెలిసేది కాదని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.మొదటి మూడు సినిమాలకు నెలకు ఇంత అని తాను పారితోషికం తీసుకున్నానని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

పారితోషికం ఎంత తీసుకోవాలో ఇద్దరు డైరెక్టర్లను అడిగినా వాళ్లు సమాధానం చెప్పలేదని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.

నిర్మాతలకు తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలంటే ఆ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తమో తక్కువ మొత్తమో తనకు తెలిసేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తరువాత టి కృష్ణ స్నేహితులలో ఒకరైన నాగేశ్వరరావు టి కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ బ్యానర్ ను స్టార్ట్ చేశారని తన డైరెక్షన్ లో తొలి సినిమా చేయడానికి రాగా తాను అంగీకరించానని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.నాలుగు వారాల మనిషి నవల స్క్రిప్ట్ ఆధారంగా కథను తయారు చేసి చంద్రమోహన్ ను హీరోగా ఎంపిక చేశామని ముత్యాల సుబ్బయ్య చెప్పారు.

హీరోయిన్ గా జీవితను ఎంపిక చేయగా రాజశేఖర్ హీరో కాకపోవడంతో ఆమె చేయనని చెప్పిందని ఇదా ప్రపంచం సినిమా సమయానికే జీవిత, రాజశేఖర్ ప్రేమలో ఉన్నారని తన ఫీలింగ్ అని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.ఆ తరువాత సీతను ఆ సినిమాలో ఎంపిక చేయగా సీత ఆ పాత్రలో అద్భుతంగా నటించారని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.

#Heroine Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు