ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తన సినీ కెరీర్ లో మొత్తం 52 సినిమాలకు దర్శకత్వం వహించగా 51 సినిమాలు విడుదలయ్యాయని ఒక సినిమా మాత్రం విడుదల కాలేదని చెప్పుకొచ్చారు.ఆకాష్ హీరోగా ప్రత్యూష హీరోయిన్ గా ముత్యాల సుబ్బయ్య ఇదేం ఊరురా బాబోయ్ పేరుతో అనే టైటిల్ తో సినిమాను ప్లాన్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తైన తర్వాత హీరోయిన్ ప్రత్యూష చనిపోయారు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాకు ఈ సినిమా రీమేక్ కాగా పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సమయంలో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
డూప్ ను పెట్టి షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకున్నా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.మొదటి నుంచి వేరే హీరోయిన్ తో షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకున్నా అలా మళ్లీ సినిమాను నిర్మించే స్థితిలో నిర్మాత లేరు.
ఈ కారణాల వల్ల అదే సమయంలో నిర్మాతల మధ్య బేధాభిప్రాయాలు రావడం వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది.

ఆ విధంగా ఇదేం ఊరురా బాబోయ్ సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయిందని ముత్యాల సుబ్బయ్య అన్నారు.సాధారణంగా దర్శకుడిని షిప్ కు కెప్టెన్ అంటారని అయితే షిప్ లేకపోతే కెప్టెన్ తో అవసరం ఉండదని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.తన సినీ కెరీర్ లో ఒకే ఒక్క కన్నడ సినిమాకు దర్శకత్వం వహించానని ముత్యాల సుబ్బయ్య అన్నారు.
పోసాని కృష్ణమురళి చెప్పిన కథతో విష్ణువర్ధన్ తో సినిమా తీశామని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.

కన్నడలో ఆ సమయంలో విష్ణువర్ధన్ నంబర్ 1 హీరో అని విష్ణువర్ధన్ తో కలిసి పని చేయడం మరిచిపోలేనని ముత్యాల సుబ్బయ్య అన్నారు.విష్ణువర్ధన్ కన్నడ హీరో అయినప్పటికీ తెలుగు భాషను బాగా మాట్లాడేవారని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.