ఆ కారణం వల్ల రాజా సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కోల్పోయా...

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితర స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి వరుస హిట్లు అందుకున్న టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు “ముత్యాల సుబ్బయ్య” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.తాజాగా ముత్యాల సుబ్బయ్య ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలగురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Director Muthyala Subbaiah Is React About Raja Movie Offer-TeluguStop.com

అయితే ఇందులో తాను టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కించిన పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం.! తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను నమోదు చేశాయని తెలిపాడు.

ఆ తర్వాత మళ్లీ తాను వెంకటేష్ తో సినిమాలను తీయలేక పోయానని కానీ వెంకటేష్ హీరోగా నటించిన “రాజా” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని పేర్కొన్నాడు.కానీ తాను అప్పటికే మరో హీరో అయిన శ్రీకాంత్ తో “మాణిక్యం” అనే చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కమిట్మెంట్ ఇచ్చానని అందువల్లే రాజా చిత్రానికి దర్శకత్వం వహించిన లేకపోయానని చెప్పుకొచ్చాడు.

 Director Muthyala Subbaiah Is React About Raja Movie Offer-ఆ కారణం వల్ల రాజా సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కోల్పోయా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిందని కానీ తాను దర్శకత్వం వహించిన “మాణిక్యం” చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని తెలిపాడు.అయితే తాను సినిమా పరిశ్రమలో ఎవరైనా సినీ నిర్మాత కి కమిట్మెంట్ ఇస్తే కచ్చితంగా ఆ కమిట్మెంట్ కి కట్టుబడి ఉంటానని అందువల్లనే తాను సినిమాలను ఒప్పుకునే ముందు పెద్దగా అడ్వాన్సులు కూడా తీసుకునే వాడిని కాదని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్ది కాలంగా దర్శకుడు “ముత్యాల సుబ్బయ్య” వయసు మీద పడటంతో సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటున్నాడు.కానీ ఒకప్పుడు మాత్రం ముత్యాల సుబ్బయ్య టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అత్యధికంగా సక్సెస్ రేటు ఉన్నటువంటి దర్శకులలో ఒకరుగా రాణించాడు.

అంతేగాక పలువురు తెలుగు హీరోలను కూడా సినిమా పరిశ్రమకి పరిచయం చేసాడు.

#Srikanth #Manikyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు