మురుగ నీకే ఎందుకు ఇలా ప్రతి సారి జరుగుతుంది?   Director Murugadasan In Deep Trouble Because Of The Sarkar Movie     2018-10-28   08:52:33  IST  Ramesh P

తమిళ సూపర్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ ప్రస్తుతం విజయ్‌ హీరోగా ‘సర్కార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విడుదలకు సిద్దం చేస్తున్నాడు. వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న దర్శకుడికి అనూహ్యంగా ఒక షాక్‌ తలిగింది. ఈ కథ నాదని, నా కథను మురుగదాస్‌ అనుమతి లేకుండా వాడేసుకున్నాడు అంటూ రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ‘సర్కార్‌’ చిత్రం విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

‘సర్కార్‌’ చిత్రం కథను తాను ఛాంబర్‌లో రిజిస్ట్రర్‌ చేయించాను, ఆ కథను, ఈ కథను పరిశీలించాల్సిందిగా సదరు రచయిత కోర్టును కోరాడు. కోర్టు వరుణ్‌ పిటీషన్‌ను స్వీకరించి వచ్చే గురువారంకు విచారణ వాయిదా వేసింది. విచారణ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు కథను సమర్పించాల్సిందిగా మురుగదాస్‌ ను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మురుగదాస్‌ స్పందిస్తూ తాను కథను కాపీ చేయలేదని, కోర్టులో తేల్చుకునేందుకు నేను సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాడు.

Director Murugadasan In Deep Trouble Because Of The Sarkar Movie-

గతంలో మురుగదాస్‌ చిత్రాలకు కూడా కాపీ క్యాట్‌ వివాదం తలెత్తింది. మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కత్తి’ సినిమా కథ కూడా వివాదాస్పదం అయ్యింది. తెలుగులో కత్తిని ఖైదీ నెం. 150 చిత్రంగా రీమేక్‌ చేసిన సమయంలో కూడా వివాదం తలెత్తింది. దాంతో మురుగదాస్‌ కు పెద్ద తలనొప్పి ఎదురైంది. తాజాగా సర్కార్‌ విషయంలో కూడా అదే జరుగుతోంది. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు మరియు మలయాళంలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశం అయ్యింది.